పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తన సినిమాల ప్రమోషన్స్ కార్యక్రమంలో ఎప్పుడూ పాల్గొనని పవన్ కళ్యాణ్... ఈసారి ‘సర్దార్’తో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడంలో బిజీ అయ్యాడు. ఇటీవలే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్ర షూటింగ్ సమయంలో బాలీవుడ్ ఫిల్మ్ రిపోర్టర్ అనుపమ చోప్రాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ ఇంటర్వ్యూకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా మరో హిందీ జర్నలిస్ట్ అజయ్ బ్రహ్మత్మజ్ కు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంధర్భంగా అజయ్ కు పవన్ ఓ మెమొరబుల్ బహుమతిని కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని అజయ్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ కు అజయ్ కృతజ్ఞతలు తెలియజేసాడు. అలాగే తాను చేసిన ఇంటర్వ్యూ జాగరన్ న్యూస్ లో పబ్లిష్ అయినట్లుగా అజయ్ చెప్పుకొచ్చాడు.
ఇక తెలుగులో కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో ఏప్రిల్ 8న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
@PawanKalyan thanks for your precious gift and time.your signature in hindi,english n telugu on same page for fans. pic.twitter.com/3W6c7MYagS
— Ajay Brahmatmaj (@brahmatmajay) March 22, 2016
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more