పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవ్వడు... ట్రెండ్ సెట్ చేస్తాడు అని చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి విచ్చేసి, థియేటర్ ట్రైలర్ మరియు ఆడియో సిడీలను విడుదల చేసారు.
ఈ సంధర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... కళ్యాణ్ బాబు నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాను నేను చాలాసార్లు చూసాను. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో చెప్పినట్లుగా పవన్ ట్రెండ్ ఫాలో అవ్వడు.. ట్రెండ్ సెట్ చేస్తాడు. గతంలో వచ్చిన షోలే తరహాలోనే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్టవడం ఖాయం. పవన్ కళ్యాణ్ అన్ని రకాల అంశాలతో ప్రేక్షకులను అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం మీ అందరితో పాటు నేను కూడా అంతే ఆతృతగా ఎదురుచూస్తున్నాను.
సినిమాల్లోకి రావడానికి ముందు పవన్ కళ్యాణ్ ప్రతి పనిలో కష్టపడి పైకొచ్చాడు. పవన్ కళ్యాణ్ సక్సెస్ లో ముందుగా సంతోషించేది నేనే. అయితే రెండుమూడు రోజులుగా నేను ఓ వార్త విన్నాను.. అదేంటంటే.. రెండు,మూడు సినిమాల తర్వాత పవన్ సినిమాల విషయంలో భవిష్యత్తు గురించి ఆలోచించుకోలేదు అన్నట్లుగా విన్నాను. కానీ ఇది సరైనది కాదు. ఇంతమంది ఆదరిస్తున్న అభిమానులను దూరం చేసుకోవద్దు. నువ్వు(పవన్ కళ్యాణ్) ఎంచుకున్న రెండు రంగాలను(రాజకీయం, సినిమాలు) కూడా విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను.
అవకాశం వున్నంత వరకు జోడు గుర్రాల స్వారీ చెయ్యి. కాబట్టి నా మాట కాదని అంటాడని నేను అనుకోవట్లేదు. సినిమా పరిశ్రమలో రికార్డులు బ్రేక్ చేయాలని హీరోల మధ్య మంచి ఆహ్లాదకరమైన పోటీ వుండాలి. ‘బాహుబలి’ రికార్డులను మరొకరు బ్రేక్ చేయాలి. ఒకదానిని మించి మరొకరు రికార్డులు బ్రేక్ చేయాలి. ఆహ్లాదకరంగా వుండాలి.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘దాయి దాయి దామ వీణ’ స్టెప్ వేసాడని ఆలీ అన్నాడు. ఆ స్టెప్ పవన్ కళ్యాణ్ ఎలా వేసాడన్నది నాకు మీ అందరి(అభిమానులు) కంటే నా ఎక్కువ ఆతృతగా వుంది. ఈ సినిమా 100రోజుల వేడుక చేసుకోవాలి... ఆ ఫంక్షన్ కు నేను కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇక సౌత్ ఇండియన్ నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. నా చిత్రానికి సంగీతం అందించాలని అడగటానికి కూడా సమయం ఇవ్వట్లేదు. ఇప్పుడు మీ ముందు చేయడానికి ఒప్పుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more