Pawan Kalyan | Sardaar Gabbar Singh | Trailer | Audio Songs

Sardaar gabbarsingh trailer

Sardaar Gabbarsingh Trailer, Sardaar Gabbarsingh Audio Launch, Sardaar Gabbarsingh Song Teaser, Pawan Kalyan Sardaar Gabbarsingh Making Video, Sardaar Gabbar Singh shooting stills, Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sardaar Gabbarsingh Trailer: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

బాబోయ్... పవర్ స్టార్ ‘సర్దార్’ ట్రైలర్ పగిలిపోయింది

Posted: 03/20/2016 10:06 PM IST
Sardaar gabbarsingh trailer

తెలుగు సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్ యూట్యూబ్ రికార్డులను బద్దలుకొట్టి, కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై వున్న అంచనాలను తారాస్థాయికి పెంచేసింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అభిమానుల కేరింతలతో ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర తెలుగు మరియు హిందీ థియేటర్ ట్రైలర్లను విడుదల చేసారు. ఇందులో పవర్ స్టార్ తనదైన స్టైల్ మార్క్ తో అదరగొట్టేసాడు. ఇందులో పవన్ స్టైల్, ఎమోషన్, యాక్షన్, కామెడీ టైమింగ్ తో దుమ్మురేపాడు. రత్తన్ పూర్ గ్రామాన్ని భైరవ్ సింగ్ అనే రౌడీ జమీందార్ గుప్పెట్లో పెట్టుకుంటాడు. అలాంటి రౌడీల తుప్పురేగ్గొట్టే సిఐ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎంట్రీ ఇచ్చి, రత్తన్ పూర్ కా బాప్ గా మారి, ప్రజల కష్టాలను ఎలా తీర్చాడనేది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కథాంశం. ఒక్కముక్కలో చెప్పాలంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్‘ ట్రైలర్ పగిలిపోయింది. మొత్తానికి ‘సర్దార్’ పేరుతో గబ్బర్ సింగ్ కొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని అర్థమవుతోంది. ఇప్పటికే టీజర్ విడుదలకాకముందే బిజినెస్ పరంగా రికార్డులను క్రియేట్ చేసింది. సినిమా విడుదలకు ముందే వంద కోట్లకు పైగా బిజినెస్ చేసింది.

బాబీ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాయ్ లక్ష్మీ, సంజనలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Sardaar Gabbarsingh  Trailer  Audio launch  Songs  

Other Articles