Sardar gabbersingh audio launch venue confomed

Sardar gabbersingh audio launch venue confomed

Power Star Powen Kalyan, Pawan Kalyan, Sardar, Sardar Gabbar Singh, Pawan kalyans Sardar

Power Star Pawan Kalyan's latest film Sardar Gabbar Singh audion launch programmee will be hold in Hyderabad Novatel. Producers arranging all arrangements for Audio Launch.

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల ఎక్కడో తెలుసా..?

Posted: 03/16/2016 03:54 PM IST
Sardar gabbersingh audio launch venue confomed

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా సినిమా జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు రెడీ ఉంది. అయితే విడుదలకు ముందు సర్దార్ ఆడియో విడుదలకు నిర్మాతలు అన్ని ఏర్పాట్లకు సిద్దమవుతున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ కు తగ్గట్టుగా, గతంలో ఎన్నడూ జరగనంతలా, సినీ జనాలు చర్చించుకునేలా భారీగా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8న సర్దార్ సినిమా సందడి చెయ్యడానికి సిద్దంగా ఉండగా.. అంతకు ముందు ఆడియో విడుదలకు సిద్దమవుతున్నారు. హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలు నిర్వహించడానికి సిద్దమవుతున్నారు.

కాగా ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపింది. ఇక ఒకే సారి తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది. హింది వర్షన్ కు సంబందించిన ఓ పోస్టర్ ను కూడా సినిమా యూనిట్ విడుదల చేసింది. కాగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వూతో హిందిలో కూడా ఈ సినిమాకు క్రేజ్ పెరిగింది. మెగా ఫ్యామిలీ అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదలచెయ్యనున్నారు. కాగా పవన్ అభిమానులకు మరింత ఆనందం కలిగిస్తున్న విషయం ఏంటంటే.. మామూలుగా రాజకీయ పార్టీల సమావేశాలు జరిగే చోట సర్దార్ ఆడియో వేడుక జరగనుంది. కాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పాత్ర కూడా ఇక్కడి నుండే మరోసారి యాక్టివ్ గా పనిచేస్తుందని కొంత మంది ఊహిస్తున్నారు. దేవీశ్రీ సర్దార్ కు బాణీలు అందించారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టాన్ ఎంటర్ టైన్ ప్రైవేట్ లిమిటెడ్, ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Power Star Powen Kalyan  Pawan Kalyan  Sardar  Sardar Gabbar Singh  Pawan kalyans Sardar  

Other Articles