Actor Pothineni ram in dilemma

Actor pothineni ram in dilemma

Ram, Ram Pothineni, Nenu Shailaja, Shivam, Pandagacheshko, Ram Pothinenis Next Film

Young and energitic Hero Ram Pothineni in Dilemma. He still not ok for any further projects. After Nenu Shailaja hit he did not committ any new projects.

సినిమా హిట్ తర్వాత డైలమాలో రామ్

Posted: 03/16/2016 02:02 PM IST
Actor pothineni ram in dilemma

తెలుగు ఇండస్ట్రీలో యంగ్ అండ్ ఎనర్జటిక్ హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రామ్. దేవదాసు సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రామ్ కెరీర్ లో రెడీ లాంటి సూపర్ హిట్ సినిమాతో స్టార్ గా మారాడు. డ్యాన్సులు, యాక్షన్ సీన్లతో పాటు కామెడీ టైమింగ్ కూడా బాగా ఉన్న రామ్ ప్రస్తుతం మాత్రం డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. నేను శైలజ సినిమా తర్వాత ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పాలా అని సందిగ్దంలో ఉన్నారట. పండగచేస్కో, శివమ్ లాంటి సినిమాల వల్ల రామ్ మార్కెట్ పూర్తిగా తగ్గిపోయినా కానీ నేను శైలజ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు.

నేను…శైల‌జ సినిమా రిలీజ్ అయ్యి మూడు నెల‌లు అవుతున్నా రామ్ త‌న తర్వాత సినిమా విష‌యంలో డైల‌మాలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏ స్టోరీ ఎంచుకోవాలి…ఏ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయాలో అన్న క‌న్‌ ఫ్యూజ‌న్‌లోనే రామ్ ఉన్నాడ‌ట‌. ఇప్పటికే  చాలా కథలు విన్న రామ్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేక‌పోయాడ‌ట‌. యాక్షన్ సినిమా చేయాలా …లేదా త‌న‌కు బాగా క‌లిసొచ్చిన ల‌వ్ అండ్ యూత్ ఫుల్ మూవీ తీయాలా అన్న డైల‌మాలో రామ్ ఉన్నట్టు ఇండ‌స్ర్టీ వ‌ర్గాల ఇన్నర్ టాక్. శ్రీను వైట్లతో రామ్ రెడీ 2 చేస్తాడ‌ని టాక్ వ‌చ్చినా వైట్ల త‌ర్వాత మెగా హీరోతో క‌మిట్ అవ్వడంతో ఇప్పుడు రామ్‌ కు స‌రైన క‌థ‌, స‌రైన డైరెక్టర్ దొరికే వ‌ర‌కు రామ్ తర్వాతి సినిమా ప‌ట్టాలెక్కేలా లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ram  Ram Pothineni  Nenu Shailaja  Shivam  Pandagacheshko  Ram Pothinenis Next Film  

Other Articles