పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘గోపాల గోపాల’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇటీవలే విడుదలైన మేకింగ్ వీడియో, టీజర్ల వరకు కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసాయి. ఇటీవలే విడుదలైన మేకింగ్ వీడియో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇదిలా వుంటే సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల 20న గ్రాండ్ గా విడుదల చేయనున్న విషయం తెలిసిందే.
ఆడియో విడుదల తేది దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించేసారు. తాజాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలోని అఫీషియల్ టీజర్ ను విడుదల చేసారు. గబ్బర్ సింగ్ ఈజ్ బ్యాక్ విత్ ‘సర్దార్’ అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అలాగే ఇందులో పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే పవర్ స్టార్ మళ్లీ రచ్చ చేయడం ఖాయమనిపిస్తోంది.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాయ్ లక్ష్మీ, సంజనలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jul 06 | ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు మృతిపట్ల సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గౌతమ్ రాజు గారి లాంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరమని... Read more
Jul 06 | ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. గత కొంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జీ అయ్యారు. అయితే ఒక్కసారిగా... Read more
Jul 04 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా... Read more
Jul 04 | నందమూరి హీరో కల్యాణ్‌రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బింబిసార. మగధ రాజ్యాన్ని పరిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథతో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ఠ్ దర్శకత్వం... Read more
Jul 04 | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త... Read more