Jr NTr accepts to act in Vakantham Vamsi debut direction

Jr ntr gives nod to act in vakantham vamsi debut direction

Junior NTR, jr NTR, Ntr, Vakantham Vamsi, Koratala Siva, Temper, Vakantham Vamsi directs NTR, Vakantham Vamsi NTR movie, Tollywood, jr ntr forth comming movies, jr ntr up comming movies, jr ntr news, jr ntr hits, jr ntr collections

tollywood young tiger Jr NTr accepts to act in Vakantham Vamsi debut direction movie

దర్శకుడిగా వక్కంతం వంశీ.. ఒప్పేసుకున్న యంగ్ టైగర్

Posted: 03/13/2016 07:21 PM IST
Jr ntr gives nod to act in vakantham vamsi debut direction

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ రైటర్స్గా పేరుతెచ్చుకున్న చాలా మంది రచయితలు తమ పంథాను మార్చుకుని దర్శకులుగా కూడా రాణిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. అదే బాటలో మరో స్టార్ రైటర్ దర్శకుడిగా మారే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా రోజులుగా ఎన్టీఆర్తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్న వక్కంతం వంశీకి ఫైనల్గా ఓకె చెప్పాడు జూనియర్. కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించిన వంశీ, త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా దర్శకుడిగా మారాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్నాడు. భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ 2 సినిమాను చేయడానికి అంగీకరించిన ఎన్టీఆర్, ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి వక్కంతం వంశీ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు.

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  jr NTR  Ntr  Vakantham Vamsi  Koratala Siva  Temper  

Other Articles