NTR | Janatha Garage | baahubali | Mohanlal | Nithya menon | Samantha

Janatha garage breaks baahubali record

Janatha Garage breaks baahubali malayalm rights record, Janatha Garage breaks baahubali record, NTR Janatha Garage updates, NTR Janatha Garage details, NTR Janatha Garage movie news, NTR, Janatha Garage, Mohanlal, Nithya menon, samantha

Janatha Garage breaks baahubali record: Young tiger ntr upcoming film Janatha Garage. Koratala Siva Direction. Mohanlal acts in lead role. Nithya menon, Samantha heroines.

బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన ఎన్టీఆర్ గ్యారేజ్

Posted: 02/16/2016 04:11 PM IST
Janatha garage breaks baahubali record

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాల హిట్స్ తో మంచి జోష్ మీదున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో ఓవర్సీస్ లో దుమ్ముధులిపేసాడు. ఇపుడు బాహుబలి రికార్డును బ్రేక్ చేసాడు. ‘బాహుబలి’ మలయాళం రైట్స్ రికార్డును ఎన్టీఆర్ గ్యారేజ్ బ్రేక్ చేసేసింది.

‘నాన్నకు ప్రేమతో’ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే చిత్రం ‘జనతా గ్యారేజ్’. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరగడంతో డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. దీంతో మలయాళంలో కూడా ‘జనతా గ్యారేజ్’కు భారీ డిమాండ్ ఏర్పడింది.

దీనికి కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకరు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరియు చిత్ర దర్శకుడు కొరటాల శివ. ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇక ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ రూపొందడం మరో కారణం.

మోహన్ లాల్ నటిస్తున్న సినిమా కావడం వల్ల మలయాళం డిస్ట్రిబ్యూషన్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ పోటీపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు ‘బాహుబలి’ సినిమా మలయాళ రైట్స్ ను 3.8 కోట్లకు అమ్ముడుపోగా.. ఆ రికార్డును ‘జనతా గ్యారేజ్’ బ్రేక్ చేసింది. ‘బాహుబలి’ రికార్డును బ్రేక్ చేస్తూ... ‘జనతా గ్యారేజ్’ రైట్స్ను ఏకంగా 4.5 కోట్లకు తీసుకున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రోడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో మోహన్ లాల్ తో పాటుగా మరో ఇద్దరు యువ మలయాళ నటులు నటించనున్నారు. ఎన్టీఆర్ సరసన నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా నటించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Mohanlal  Nithya menon  samantha  

Other Articles