Kalyana Vaibhogame Release Date | Naga shaurya | Malavika Nair | Trailers

Kalyana vaibhogame release on 4 march

Kalyana Vaibhogame Movie Release Date, Kalyana Vaibhogame Jukebox, Kalyana Vaibhogame Trailers Kalyana Vaibhogame Movie Posters, Kalyana Vaibhogame Movie news, Kalyana Vaibhogame Movie stills, Kalyana Vaibhogame Movie updates, Kalyana Vaibhogame, Naga shaurya, Malavika Nair, Audio release date

Kalyana Vaibhogame Release on 4 March: Kalyana Vaibhogame 2016. featuring Naga Shourya and Malavika Nair exclusively on Madhura Audio. Music composed by Kalyan Koduri. Directed by BV Nandini Reddy and produced by KL Damoodar Reddy.

‘నాగశౌర్య-మాళవిక’ల పెళ్లికి ముహూర్తం ఖరారు

Posted: 02/16/2016 01:05 PM IST
Kalyana vaibhogame release on 4 march

'అలా మొదలైంది',' అంతకు ముందు ఆ తరువాత ' వంటి ఉత్తమాభిరుచి గల చిత్రాలను నిర్మించిన ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మాణంలో దర్శకురాలు బి.వి.నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. నందిని రెడ్డి తన మొదటి చిత్రం ' అలా మొదలైంది ' శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందించిన విషయం విదితమే.

‘కళ్యాణ వైభోగమే’ చిత్రాన్ని మార్చి 4 న విడుదల చేయనున్నట్లు నిర్మాత కె.ఎల్ . దామోదర్ ప్రసాద్ తెలిపారు. తమ సంస్థ నిర్మించిన 'అలా మొదలైంది',' అంతకు ముందు ఆ తరువాత ' చిత్రాల స్థాయిని మించి ఈ " కళ్యాణ వైభోగమే " చిత్రం చక్కని విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని అన్నారు. దానికి కారణం చిత్ర కధ ,కధనం,సంగీతం , సంభాషణలు, ఛాయాగ్రహణం ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయని అన్నారు. ప్రముఖ పంపిణీదారులైన 'అభిషేక్ పిక్చర్స్' తమ " కళ్యాణ వైభోగమే చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని నిర్మాత కె.ఎల్ . దామోదర్ ప్రసాద్ తెలిపారు.

ప్రస్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం " కళ్యాణ వైభోగమే " అని దర్శకురాలు బి.వి నందిని రెడ్డి తెలిపారు. చిత్రం ఆడియో విజయం చిత్ర విజయం పై మరింత నమ్మకాన్ని పెంచిందని తెలిపారు.

నటీనటులు :
నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , రాశి , ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ , తాగుబోతు రమేష్ , ధనరాజ్ , 'మిర్చి' హేమంత్ , స్నిగ్ధ తదితరులు.

సాంకేతిక నిపుణులు :
సంగీతం: కళ్యాణ్ కోడూరి; సినిమాటోగ్రఫీ: జి.వి.ఎస్. రాజు; ఎడిటర్: జునైద్ సిద్దిక్; కొరియోగ్రఫీ: చిన్నిప్రకాష్, రఘు, అని; యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు; కాస్ట్యూమ్ డిజైనర్: శ్రీ, వైశాలి; డైలాగ్స్ & లిరిక్స్: లక్ష్మీ భూపాల్; కో - ప్రొడ్యూసర్స్: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి.వి; ప్రొడ్యూసర్: కె.ఎల్. దామోదర్ ప్రసాద్; స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: బి.వి.నందిని రెడ్డి .

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyana Vaibhogame  Release Date  Naga shaurya  Malavika Nair  Trailers  

Other Articles