Vijay Sethupathi | Madhavan | villain | Tamil movies | Stills

Vijay sethupathi as villain in madhavan film

Vijay Sethupathi to play villain in Madhavan, Vijay Sethupathi villain in Madhavan, Vijay Sethupathi villain role in Madhavan film, Vijay Sethupathi movies, Madhavan movies, Madhavan movie updates, Madhavan stills

Vijay Sethupathi as villain in Madhavan film: Tamil lover hero Madhavan upcoming film details. Madhavan Irudhi suttru movie collections, details, stills, gallery.

మాధవన్ కోసం విజయ్ విలనిజం

Posted: 02/16/2016 04:49 PM IST
Vijay sethupathi as villain in madhavan film

తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోలుగా మంచి క్రేజ్ ను దక్కించుకున్న మాధవన్, విజయ్ సేతుపతి త్వరలోనే స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. చాలా కాలం తర్వాత మాధవన్ నటించిన ‘ఇరుధి సుట్రు’ చిత్రం విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సింగ్ కోచర్ గా మాధవన్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా విజయంతో తమిళంలో మాధవన్ కు మరిన్ని అవకాశాలు పెరిగాయి.

మాధవన్ తో ఓ సినిమా చేయడానికి దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి సిద్దమయ్యారు. ఇటీవలే మాధవన్ కు ఓ స్టోరీని కూడా వినిపించారట. ఈ ప్రాజెక్టుకు మాధవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. ఈ విషయంపై పుష్కర్-గాయత్రి తాజా చిత్రం గురించి తెలుపుతూ మాధవన్‌కు కథ వినిపించిన మాట నిజమేనన్నారు. అయితే ఆయన ఆలోచించుకోవడానికి ఒక వారం గడువు అడిగారని చెప్పారు. ఇది తమ గత చిత్రాలకు మాత్రమే కాకుండా మాధవన్ ఇంతకు ముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇక ఇందులో విలన్ పాత్రలో విజయ్ సేతుపతిని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి.. మరి ఈ సినిమాలో విలన్ గా నటించడానికి అంగీకరిస్తాడో లేదో అనే విషయం త్వరలోనే తెలియనుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhavan  Vijay Sethupathi  villain  tamil movies  stills  

Other Articles