Sunil | Krishnashtami | Release Date | Trailers

Sunil krishnashtami film release on 19 feb

Sunil Krishnashtami Release Date, Krishnashtami Film Release Date, Krishnashtami Movie Trailers, Krishnashtami Movie Songs, Krishnashtami Movie Videos, Krishnashtami Movie Posters, Krishnashtami Movie Stills, Krishnashtami Movie Cast and Crew, Sunil, Nikki Galrani, Dimple Chopade

Sunil Krishnashtami Film Release on 19 Feb: Hero Sunil's upcoming family entertainer, 'Krishnashtami', was all set for a release on February 5th. However, the film has now moved to February 19th.

ఫిబ్రవరి 19న ‘కృష్ణాష్టమి’ గ్రాండ్ రిలీజ్

Posted: 01/30/2016 09:21 AM IST
Sunil krishnashtami film release on 19 feb

చక్కటి డాన్సులతో, సూపర్బ్ కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ హీరోగా, వాసు వర్మ దర్శకత్వంలో ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం 'కృష్ణాష్టమి'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధ పడుతోంది.

"మేము 5న వచ్చేందుకు రెడీగా ఉన్నప్పటికీ, 'స్పీడున్నోడు' 5న, 'కృష్ణ గాడి వీరప్రేమగాధ' 12న వస్తామని రిక్వెస్ట్ చేయటంతో, ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో, మా కృష్ణాష్టమి చిత్రాన్ని ఫిబ్రవరి 19కి వాయిదా వేయటం జరిగింది", అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

ఈ ఫామిలీ ఎంటర్టైనర్ ఆడియోను ఇటీవలే రాజమండ్రిలోని GIET కాలేజీలో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసారు. నిక్కి గల్రాని మరియు డింపుల్ చోపడే హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించారు.

దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని, ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫ్యామిలీ వాల్యూస్ ఈ చిత్రంలో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియాలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్".

సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, రాజన్ మోడీ, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రం విడుదల తేది మరియు ఇతర వివరాలను త్వరలోనే తెలుపుతాం అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

దర్శకత్వం - స్క్రీన్ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం . ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Krishnashtami  Release Date  Trailers  Nikki Galrani  Dimple Chopade  

Other Articles