Kangana Ranaut talks about her life struggles

Kangana ranaut talks about her life struggles

Kangana Ranaut stuggles, Kangana Ranaut latest news, Kangana Ranaut stills, Kangana Ranaut hot news, Kangana Ranaut latest updates, Kangana Ranaut movie news, Kangana Ranaut movie updates, Kangana Ranaut hot stills

Kangana Ranaut talks about her life struggles: Kangana Ranaut talks about her journey in Bollywood.

ఈ అమ్మడిపై ఓ సెలబ్రెటీ లైంగిక దాడి

Posted: 01/19/2016 03:27 PM IST
Kangana ranaut talks about her life struggles

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పుడంటే బాలీవుడ్ క్వీన్ గా కొనసాగుతోంది కానీ... తనకు సరైన హిట్లు లేని సమయంలో చాలా సమస్యలే ఎదుర్కొందట. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఓ బాలీవుడ్ సెలబ్రెటీ తనను దారుణంగా లైంగిక దాడి చేసాడని కంగానా తన గతంలోని చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది.

ఈ విషయంపై కంగానా స్పందిస్తూ... తను సినిమాల్లో నటించేందుకు వచ్చిన తొలినాళ్లలో... అంటే దాదాపు 17ఏళ్ల వయసున్నప్పుడు ఓ సెలబ్రెటీ తనపై లైంగిక దాడి చేసాడట. ఆ దాడిలో తాను ఎదురుతిరగడంతో సదరు సెలబ్రెటీ తన తలపై బలంగా కొట్టాడని, అందువల్ల తల పగిలి రక్తస్రావం అయ్యిందని కంగానా చెప్పుకొచ్చింది. ఈ దాడి గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ .. పోలీసులు మాత్రం కేవలం ఓ వార్నింగ్ ఇచ్చేసి వదిలేసారట. అతడికి ఇండస్ట్రీలో మంచి పలుకుబడి వుండటం వల్లనే అతను తేలికగా తప్పించుకోగలిగాడని కంగానా తెలిపింది.

కానీ తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తి ఎవరో మాత్రం కంగానా బయటపెట్టలేదు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో చాలా దుర్భర జీవితాన్ని అనుభవించినట్లుగా కంగానా చెప్పుకొచ్చింది. సీన్ కట్ చేస్తే.. ఈ అమ్మడు నటించిన సినిమాలు ఈ మధ్య వరుసగా విజయం సాధిస్తుండటం, నటిగా ప్రశంసలు దక్కించుకోవడం, అవార్డులతో సక్సెస్ ను సొంతం చేసుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  struggles  Interview  hot news  stills  

Other Articles