Prakash Raj’s Directorial Movie ‘Mana Oori Ramayanam’ to release in february

Prakash raj production house releases mana oori ramayanam in february

prakash raj’s directorial movie, prakash rai productions ‘mana oori ramayanam’, mana oori ramayanam, prakash raj movies, prakash raj, bilingual film, mana oori ramayanam latest updates, prakash raj news,

Prakash Raj has his hands full with work. He is busy wrapping up his directorial venture Mana Oori Ramayanam.

మన ఊరి రామాయణానికి ముహూర్తం ఫిక్స్

Posted: 01/17/2016 02:14 PM IST
Prakash raj production house releases mana oori ramayanam in february

తన విలక్షణ నటనతో సౌత్, నార్త్ ఇండస్ట్రీలను ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్.., తన సోంత నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తాజా చిత్రం మన ఊరి రామాయణం. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడిగా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ధోని, ఉలవచారు బిర్యానీ లాంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రకాష్ రాజ్ త్వరలోనే మన ఊరి రామాయణం చిత్రంతో.. సరికొత్త కాన్సెప్ట్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు కూడా ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడు విలక్షణ నటుడు.

తన సొంతం నిర్మాణ సంస్థ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో మన ఊరి రామయణం సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా తన ట్విట్టర్లో వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prakash raj  mana oori ramayanam  Ilaya raja  February  

Other Articles