Kodandarami Reddy says Cockfight is Andhra people's tradition

Kodandarami reddy got stay and luncheon at chirus residence

Kodandarami Reddy, Tollywood Film director and producer Kodandarami Reddy, chiranjeevi, chiru luncheon kodandarami reddy, Kodandarami Reddy cock fight, Kodandarami Reddy godavari districts, mega star chiranjeevi,

Film director Kodandarami Reddy was among those who turned out to watch a cockfight in one village near Eluru in West Godavari district.

చిరు నివాసంలోనే విడిది, విందు.. కోడి పందేళ్లను చూసిన కోదండుడు

Posted: 01/15/2016 04:56 PM IST
Kodandarami reddy got stay and luncheon at chirus residence

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో విడిది చేశామని ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తెలిపారు. అంతేకాదు ఇవాళ రాత్రికి వారింట్లోనే విందులో పాల్గొంటున్నామని ఆ తరువాత సినిమాకు వెళ్లనున్నామని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కోడి పందాలను చూడటానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి అంటే ఉభయగోదావరి జిల్లాల్లో ఉండే సందడే వేరని అన్నారు. ఇక్కడ ప్రతి ఊరిలోనూ పండగ శోభ కొట్టొచ్చినట్టు కనబడుతుందని ఆయన చెప్పారు. ప్రతి సంక్రాంతికి ఇక్కడే జరుపుకుంటామని చెప్పారు.

తనకు కోడి పందాలను చూసి ఆస్వాదిస్తానని చాలా ఇష్టమన్నారు. అయితే తనకు పేకాట, బెట్టింగులు రాకపోవడంతో వాటిల్లో పాల్గొనే అవకాశం లేదని, దూరం నుంచి చూసి ఆనందించడమేనని ఇష్టమన్నారు. కాగా ఒక్క చోటులోనే కాకుండా అన్ని ప్రాంతాలను ఈ మూడు రోజుల్లో తిరిగుతూ సంబరాలను వీక్షించడం తనకు ఇష్టమన్న ఆయన..ఉభయగోదావరి జిల్లాల్లో కొన్ని ఊర్లను నిన్నే చుట్టామని, ఈ రోజు కొన్నింటిని చూస్తున్నామని ఆయన చెప్పారు. చిరంజీవి ఇంట్లొ విందు తరువాత ఎక్స్ ప్రెస్ రాజా సినిమా చూసేందుకు వెళ్తున్నామని ఆయన వివరించారు. మూడు రోజులు పూర్తిగా ఎంజాయ్ చేసి, ఏడాదికి సరిపడా అనుభూతులను గుండెల్లో నింపుకుని తిరిగి వెళ్తామని కొదండుడు చెప్పారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  kodandarami reddy  Director  sankranti  

Other Articles