Jr NTR’s ‘Nannaku Prematho’ rakes in over Rs.30 crore in three days

Ntr jr s nannaku prematho mints over rs 30 crores in three days

nannaku prematho, nannaku prematho box office collection, nannaku prematho review, nannaku prematho collections, nannaku prematho business, jr ntr, rakul preet, jr ntr nannaku prematho, nannaku prematho news, entertainment news

Actor Jr NTR's Telugu drama "Nannaku Prematho" has grossed over Rs.30 crore worldwide in the first three days since its release.

కలెక్షన్లలో దూసుకుపోతున్న నాన్నకు ప్రేమతో..

Posted: 01/17/2016 02:16 PM IST
Ntr jr s nannaku prematho mints over rs 30 crores in three days

జూనియర్ ఎన్టీయార్ తాజా చిత్రం నాన్నకు ప్రేమతో బాక్సాఫీసు వద్ద కనకవర్షాన్ని కురిపిస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన భారీ సినిమాలన్నీ కాసుల వర్షం కురిపిస్తుండగా, అన్నింటి కంటే ముందు జనవరి 13న రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం కలెక్షన్ల పరంగా ఎన్టీఆర్ కెరీర్లోనే సరికొత్త రికార్డ్లను నమోదు చేసుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే 12 కోట్ల వసూళ్లతో ఆకట్టుకుంది. రిలీజ్ తరువాత డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం నాన్నకు ప్రేమతో దూసుకుపోతోంది.

తొలి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల వసూళ్లను రాబట్టింది నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ స్థాయిలో 1700 థియేటర్లకు పైగా రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో తొలి వారంలో 50 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. కాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ సాంగ్ ను కూడా మళ్లీ యాడ్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈసినిమాలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nannaku Prematho  Ntr  sukumar  rakul preeth singh  

Other Articles