Pawan Kalyan | Sardaar Gabbar Singh | Teaser | Release Date | Posters

Sardaar gabbar singh movie teaser release on 14 january

Sardaar Gabbar Singh Teaser Release on 14 January, Sardaar Gabbar Singh Teaser Date, Pawan kalyan Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sardaar Gabbar Singh Movie Teaser Release on 14 January: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

సంక్రాంతి కానుకగా ‘రత్తన్ పూర్ కా సర్దార్’ టీజర్

Posted: 01/13/2016 11:02 AM IST
Sardaar gabbar singh movie teaser release on 14 january

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు, వర్కింగ్ ఫోటోలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే సంక్రాంతి కానుకగా అభిమానుల కోసం ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను జనవరి 14న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘రత్తన్ పూర్ కా సర్దార్ ఆగయా’ అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేసారు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ ఓ కీలక పాత్రలో నటించడమే కాకుండా పవన్ తో రెండు మాస్ మసాలా పాటల్లో చిందులేసింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Sardaar Gabbar singh  Teaser Release Date  posters  

Other Articles