Sravanthi Ravi Kishore | Nenu Sailaja | Ram | Last Movie

Sravanthi ravi kishore says nenu sailaja my last film

Sravanthi Ravi Kishore Ends with Nenu Sailaja, Sravanthi Ravi Kishore latest news, Sravanthi Ravi Kishore last film, Sravanthi Ravi Kishore movie updates, Nenu Sailaja movie collections, Nenu Sailaja

Sravanthi Ravi Kishore Says Nenu Sailaja My Last Film: Tollywood successfull producer Sravanthi Ravi Kishore says Nenu Sailaja Is My Last Movie.

శైలజతో దూరమవుతున్న స్రవంతి రవికిశోర్

Posted: 01/12/2016 04:57 PM IST
Sravanthi ravi kishore says nenu sailaja my last film

ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఇక నిర్మాణ రంగానికి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. శ్రీ స్రవంతి మూవీస్ అనే బ్యానర్ పై ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, రెఢీ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు స్రవంతి రవికిశోర్.

తాజాగా ఈ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మించిన ‘నేను శైలజ’ చిత్రం విడుదలై, మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. పూర్తి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని, కలెక్షన్ల మోత మోగిస్తోంది. అయితే ఈ సంధర్భంగా ఆయన సక్సెస్ మీట్ లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై నుంచి తాను నిర్మాణ రంగానికి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్లుగా స్రవంతి రవికిశోర్ ప్రకటించారు.

అయితే తాను నిర్మాణ రంగం నుంచి తప్పుకున్నప్పటికీ.. స్రవంతి మూవీస్ బ్యానర్ మాత్రం కొనసాగుతుందని, హీరో రామ్ సోదరుడు కృష్ణ చైతన్య ఇకపై ఆ బ్యానర్ పై వచ్చే సినిమాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. త్వరలోనే ‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ చిత్రం అందించిన హీరో రామ్, దర్శకుడు కిశోర్ తిరుమలల కలయికలో మరో సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతోనే కృష్ణ చైతన్య నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సినిమా వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nenu Sailaja  Sravanthi Ravi Kishore  Last Film  Ram  

Other Articles