Pawan Kalyan | Complaint Against | BVSN Prasad | Nannaku Prematho | Attarintiki Daredi

Pawan kalyan complaint against on nannaku prematho producer

Pawan Kalyan Complaint Against on BVSN Prasad, Pawan Kalyan Complaint on BVSN Prasad, Pawan Kalyan Complaint on Nannaku Prematho Producer, Nannaku Prematho in trouble, Nannaku Prematho producer in troubles, Nannaku Prematho issues, Nannaku Prematho movie release date, Nannaku Prematho

Pawan Kalyan Complaint Against on Nannaku Prematho Producer: Power star Pawan Kalyan Complaint Against on Nannaku prematho film producer BVSN Prasad in MAA.

ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’పై పవర్ స్టార్ ఎటాక్

Posted: 01/12/2016 04:10 PM IST
Pawan kalyan complaint against on nannaku prematho producer

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్ర విడుదలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆటంకంగా మారనున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈయనపై పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు ఫిర్యాదు చేసారు. బివిఎస్ఎన్ ప్రసాద్ పై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడానికి ‘అత్తారింటికి దారేది’ చిత్రమే కారణం.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే దాదాపు 75శాతం సినిమా లీకయ్యింది. దీంతో ఈ సినిమా ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తుతాయేమోననే ఉద్దేశ్యంతో దర్శకుడు త్రివిక్రమ్ మరియు హీరో పవన్ కళ్యాణ్ లు తమ రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని నిలిపివేసారు. అయితే విడుదలకు ముందే సినిమా మొత్తం లీకైన కూడా ‘అత్తారింటికి దారేది’ చిత్రం మాత్రం విడుదలై భారీ విజయం సాధించడమే కాకుండా, కలెక్షన్ల మోత మోగించేసింది.

ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కు దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి వుంది. పవన్ కళ్యాణ్ కు ఇవ్వవలసిన డబ్బును తన తర్వాతీ చిత్రం విడుదల సమయంలో ఇస్తానని మాటిచ్చాడట నిర్మాత. అనుకున్న ప్రకారం ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత బివిఎస్ఎన్ ప్రసాద్ తీసిన తర్వాతీ చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇదిలా వుంటే తనకు ఇవ్వాల్సిన రెండు కోట్ల రెమ్యునరేషన్ చెల్లించాలంటూ పవన్ కళ్యాణ్ తాజాగా ‘మా’ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసారు. అక్కడి నుంచి నిర్మాతల మండలికి ఈ ఫిర్యాదు చేరుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఏమైనా చర్చలు జరిపి సమస్య సద్దుమనిగితే ‘నాన్నకు ప్రేమతో’ విడుదలకు అడ్డుతొలగినట్లే.. లేదంటే.. నిర్మాతల మండలికి ఫిర్యాదు వెళ్లడం వల్ల ఈ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం వుంది.

ఇప్పటికే బాలయ్య ‘డిక్టేటర్’ సినిమా వల్ల ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి థియేటర్ల కొరత ఏర్పడింది. ఇదిలా వుంటే తాజాగా పవన్ కళ్యాణ్ ఫిర్యాదుతో మరోసారి ఈ సినిమాకు కష్టాలు ఎదురవుతున్నాయి. మరి ఈ విషయంలో నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles