Karisma Kapoor kids court news

Karisma kapoor kids court news

Karisma Kapoor kids court issue, Karisma Kapoor latest news, Karisma Kapoor court issue, Karisma Kapoor latest updates, Karisma Kapoor hot news, Karisma Kapoor stills

Karisma Kapoor kids court news: Actress Karisma Kapoor and her Delhi-based businessman husband, Sunjay ... All formalities over, they were in court to get the divorce.

తన పిల్లలకు కరిష్మా దూరం కానుందా?

Posted: 12/31/2015 11:11 AM IST
Karisma kapoor kids court news

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీష్మా కపూర్ గతకొద్ది కాలంగా తన భర్త సంజయ్ కపూర్ కు దూరంగా వుంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఇప్పటికీ విడాకుల గొడవ కొనసాగుతూనే వుంది. తాజాగా వీరిద్దిరి విడాకుల మ్యాటర్ మరోసారి తెరపైకొచ్చింది. ప్రస్తుతం కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ భర్త సంజయ్ కపూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

గత నెలలోనే ఈ దంపతుల విడాకుల పిటిషన్‌ను కోర్టు పరిష్కరించింది. విడాకుల కోసం గతంలో వీరు దాఖలు చేసిన ఉమ్మడి సమ్మతిని ఉపసంహరించుకోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తన పిల్లలు సమీర, కియాన్‌రాజ్‌లను కరిష్మా నుంచి తనకే అప్పగించాలని కోరుతూ 15 రోజుల కిందట సంజయ్‌కపూర్ ఫామిలీ కోర్టులో దరఖాస్తు చేశారని ఆయన తరఫు లాయర్ తెలిపారు.

గతంలో కూడా ఇదే తరహా అప్లికేషన్‌ను  సంజయ్‌కపూర్ కోర్టులో వేశారని, కానీ అప్పట్లో విడాకుల కోసం ఇద్దరు ఉమ్మడి సమ్మతితో కోర్టును ఆశ్రయించడం, విడాకుల చట్టంలో పిల్లల సంరక్షణకు సంబంధించి పలు నిబంధనలు ఉండటంతో ఆయన తన దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లుగా ఆయన వివరించారు. మరి ఈ విషయంపై కోర్టు ఎలాంటి తీర్పునివ్వనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karisma Kapoor  Court Issue  Kids  Hot stills  Gossips  

Other Articles