Sampoornesh Babu Kobbari Matta Paparayudu First Look

Sampoornesh babu kobbari matta paparayudu first look

Sampoornesh Babu Paparayudu as Kobbari Matta Movie, Sampoornesh Babu Kobbari Matta latest news, Sampoornesh Babu Kobbari Matta Movie posters, Sampoornesh Babu Kobbari Matta Movie Stills, Sampoornesh Babu Kobbari Matta, Sampoornesh Babu Kobbari Matta stills, Sampoornesh Babu Kobbari Matta updates, Sampoornesh Babu, Kobbari Matta

Sampoornesh Babu Kobbari Matta Paparayudu First Look: Burning star Sampoornesh Babu upcoming film Kobbari Matta. Gayatri gupta, Geethanjali, Ishika, Sri sudha heroines.

బాబోయ్.. పాపారాయుడు ఫస్ట్ లుక్ పిచ్చి కామెడీ

Posted: 12/31/2015 03:28 PM IST
Sampoornesh babu kobbari matta paparayudu first look

‘హృదయ కాలేయం’, ‘సింగం123’ చిత్రాలతో ఆకట్టుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. దర్శకుడు స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంపూ మూడు విభిన్న గెటప్ లతో కనిపించనున్నాడు. పాపరాయుడు, పెదరాయుడు, ఆండ్రాయడ్ అంటూ మూడు విభిన్న పాత్రలలో అలరించబోతున్నాడు.

ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు మారుతి గుడ్ సినిమా గ్రూప్ పై సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘పాపారాయుడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. బాబోయ్ సంపూ కామెడీ మరీ భీభత్సంగా వున్నట్లుగా కనిపిస్తోంది.

ఈ పోస్టర్ చూస్తుంటేనే తెగ నవ్వొస్తుంది. మరి ఈ సినిమా ఎలా వుండబోతుందో చూడాలి. ఈ సినిమాలో సంపూ సరసన గాయత్రీ గుప్తా, గీతాంజలి, ఇషిక, శ్రీ సుధలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh Babu  Kobbari Matta  Paparayudu Posters  Stills  News  

Other Articles