Allari Naresh Dance with Rashi in Maa Talkies Show

Allari naresh dance with rashi in maa talkies show

Allari Naresh Lifts Rashi in Maa Talkies Show, Allari Naresh Lifts Rashi, Allari Naresh romance with Rashi, Allari Naresh Rashi Song, Allari Naresh dance with Rashi, Allari Naresh rashi hot song, Allari Naresh, Rashi

Allari Naresh Dance with Rashi in Maa Talkies Show: Allari Naresh latest film Mama Manchu Alludu Kanchu. Allari Naresh special dance with Actress Rashi in Maa Talkies show.

అల్లరోడి తిప్పుడికి ఇద్దరు అత్తలు ఫుల్ ఖుషీ

Posted: 12/30/2015 03:44 PM IST
Allari naresh dance with rashi in maa talkies show

అల్లరి నరేష్ దెబ్బకు ఇద్దరు అత్తలు కంగారుపడిపోయారు. అసలే తన మొదటి సినిమా ‘అల్లరి’ టైటిల్ ను తన ఇంటిపేరుగా మార్చేసుకున్న అల్లరి నరేష్... ఇక పలు ఈవెంట్లలో కూడా కాస్త సరదాగా వుంటాడనే విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య ఆ సరదా కాస్త ఎక్కువయ్యి కత్తిలాంటి ఆంటీలను కంగారుపెట్టేస్తున్నాడు.

ఇంతకీ ఆ అత్తలు ఎవరు? నరేష్ ఎందుకు కంగారు పెడుతున్నాడని అనుకుంటున్నారా? ఆ అత్తలు రోజా మరియు రాశి. ప్రస్తుతం రోజా అత్త పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటిస్తుంది. అలాగే రాశి కూడా తాజాగా ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే గతంలో నరేష్ నటించిన ‘యాక్షన్3డి’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ‘జబర్దస్త్’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇందులో ‘స్వాతిముత్యపు జల్లులో...’ పాటకు రోజాతో కలిసి డాన్స్ చేయడమే కాకుండా రెండుసార్లు రోజాను ఎత్తుకొని తెగ తిప్పేసాడు.

Click Here for Allari Naresh Rashi Video

ఇక సీన్ కట్ చేస్తే... అల్లరి నరేష్ సినిమాలు ఈ మధ్య వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ‘సుడిగాడు’ తర్వాత అల్లరి నరేష్ నటించిన సినిమాలేవి కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ప్రస్తుతం నరేష్ నటించిన తాజా చిత్రం ‘మామ మంచు అల్లుడు కంచు’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ‘మా టాకీస్’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇందులో రాశి అత్తగా వ్యవహరిస్తుంది. అయితే ‘మామ మంచు అల్లుడు కంచు’ ప్రమోషన్స్ భాగంగా మరోసారి ‘స్వాతి ముత్యపు..’ సాంగ్ లో రాశితో కలిసి నరేష్ చిందులేసాడు.

అంతేకాకుండా రాశిని అమాంతం ఎత్తుకొని తెగ తిప్పేసాడు. అంతేకాకుండా రాశి చాలా బరువుగా వున్నట్లుగా అనిపించలేదని కాంప్లిమెంట్ ఇచ్చేసాడు నరేష్. నరేష్ ఎత్తుకొని తిప్పడం, అలాగే కాంప్లిమెంట్స్ రాశి ఫుల్ ఖుషీ అయిపోయింది. ఏదేమైనా ఇలా సందు దొరికినప్పుడల్లా ఒకప్పటి స్టార్ హీరోయిన్లు.. ఇప్పటి ఆంటీలతో నరేష్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి రోజా, రాశిల తర్వాత నరేష్ ఎత్తుకోబోయే ఆ అత్త ఎవరో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Rashi  Dance  Romance  Mama Manchu Alludu Kanchu  

Other Articles