NTR Nannaku Prematho Trailer Creates Record

Ntr nannaku prematho trailer creates record

Nannaku Prematho Movie Trailer Creates Record, Nannaku Prematho Audio Jukebox, Nannaku Prematho Movie News, Nannaku Prematho Movie Posters, Nannaku Prematho Movie stills, Nannaku Prematho Movie Release Date, Nannaku Prematho Audio, Ntr, Rakul Preet Singh

NTR Nannaku Prematho Trailer Creates Record: Young tiger ntr Nannaku Prematho Movie Release on 13 January. Sukumar direction, Devi Sri Prasad Music, Rakul Preet singh heroine.

రికార్డులు మోత మోగిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ ట్రైలర్

Posted: 12/30/2015 10:41 AM IST
Ntr nannaku prematho trailer creates record

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసారు. ఈ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ విడుదలైన 30 గంటల్లో 1,429,379 మంది ఈ వీడియోను వీక్షించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘నాన్నకు ప్రేమతో’ ట్రైలర్ టాప్ స్థానంలో నిలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

యంగ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇందులో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. బ్యూటిఫుల్ ఫ్యామిలీ, లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Nannaku Prematho  Release Date  Jukebox  Rakul Preet Singh  Stills  

Other Articles