Dil Raju Bags Dictator Nizam Rights

Dil raju bags dictator nizam rights

Balakrishna Dictator Nizam Rights Sold, Balakrishna Dictator Release on 14 January, Balakrishna Dictator First Look, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator Movie shooting updates, Balakrishna Dictator News, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator, Balakrishna Latest News, Balakrishna Movie News, Balakrishna Movie Updates

Dil Raju Bags Dictator Nizam Rights: Nandamuri balakrishna latest film Dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music. Balakrishna Dictator Movie Release on Pongal 2016.

ఫుల్ ఖుషీలో ‘డిక్టేటర్’ ఫ్యాన్స్.. హిట్టు గ్యారెంటీ!

Posted: 12/30/2015 04:11 PM IST
Dil raju bags dictator nizam rights

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ చిత్రం ‘డిక్టేటర్’ నైజాం హక్కులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకోవడంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతకొద్ది కాలంగా దిల్ రాజు నైజాం రైట్స్ తీసుకున్న ప్రతీ సినిమా కూడా విజయం సాధిస్తూ వస్తోంది. తాజాగా ‘డిక్టేటర్’ నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దిల్ రాజు భారీ మొత్తంలో చెల్లించి, సొంతం చేసుకోవడంతో ‘డిక్టేటర్’ విజయంపై పూర్తి నమ్మకంతో వున్నారు నందమూరి బాలయ్య ఫ్యాన్స్.

ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలయ్య సరసన అంజలి, సొనాల్ చౌహన్, అక్షలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో శ్రద్ధాదాస్, ముమైత్ ఖాన్ లు ‘టింగా టింగా’ అనే ఐటెం సాంగ్ లో నటించారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  Dil Raju Bags  Nizam Rights  Release Date  Anjali  sonal chauhan  stills  

Other Articles

Today on Telugu Wishesh