beep-song-controversy-police-launch-hunt-for-tamil-star

Youtube disagrees to remove simbus beef song

Kollywood, Simbu actor, you tube, the beep song, t r silambarasan, anirudh ravichander, simbu, anirudh, t r silambarasan the beep song, anirudh ravichander the beep song, entertainment news, beyond the news

YouTube disagrees to remove simbu beef song from online, asks what is wrong in it

శింబు పాటను తొలగించేందుకు నిరాకరణ

Posted: 12/27/2015 07:46 PM IST
Youtube disagrees to remove simbus beef song

తమిళనటుడు శింబు పాడగా, కలకలం సృష్టించిన బీప్ సాంగ్ ను తొలగించేందుకు యూట్యూబ్ నిరాకరించింది. నవంబర్ 11న ఈ పాట యూట్యూబ్ లో అప్ లోడ్ కాగా, ఇప్పటికే దీన్ని 10 లక్షల మందికి పైగా వీక్షించారు. బీప్ సాంగ్ పై రాద్ధాంతం పెరుగుతుండటంతో, ముందుగా సామాజిక మాధ్యమాల నుంచి దీన్ని తొలగించాలని భావించిన చెన్నై పోలీసులు యూట్యూబ్ ను సంప్రదించి ఈ సాంగ్ ను తీసివేయాలని కోరారు. తమకు ఆ పదాల అర్థం ఏమిటో ఆంగ్లంలోకి అనువదించి చెప్పాలని యూట్యూబ్ కోరింది.

దీంతో అతి కష్టం మీద అరకొర అర్థాలతో బీప్ సాంగ్‌ను పోలీసులు ఆంగ్లంలోకి అనువదించి చెప్పగా అందులో పెద్దగా తప్పు పట్టాల్సిన విషయం ఏమీ లేదని యూట్యూబ్ నిర్వాహకులు తేల్సి చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. దీంతో అసలు ఇంతగా కలకలం సృష్టిస్తున్న ఆ పాట యూట్యూబ్‌లోకి ఎలా వచ్చింది? దీనికి కారకులెవరు?అన్న విషయాలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. ఐపీ అడ్రస్ ఆధారంగా దోషులను పట్టుకోవాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beep song  Kollywood  Simbu actor  you tube  

Other Articles