Pawan Kalyan agree for that in the Trivikram cinema

Pawan kalyan in trivikram cinema

Pawan Kalyan, Nitin cinema, Trivikram, Pawan Kalyan Guest Role, Pawan Kalyan News, Trivikram Cinema, Pawan Kalyan in Trivikram Cinema, Power Star Pawan Kalyan

Power Star pawan Kalyan agree to do guest role in Trivikram upcoming movie A..aa. Trivikram directing Nitin in this cinema.

అప్పుడు చిరు కోసం, ఇప్పుడు త్రివిక్రమ్ కోసం పవన్ కళ్యాణ్

Posted: 12/28/2015 10:51 AM IST
Pawan kalyan in trivikram cinema

పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ మరోసారి అందుకు సిద్దమవుతున్నారు. నాడు అన్న మెగాస్టార్ చిరంజీవి కోసం... నేడు డైరెక్టర్ త్రివిక్రమ్ కోసం పవన్ కళ్యాణ్ సిద్దపడుతున్నారు. గతంలో తన అన్న చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ లో గెస్ట్ రోల్ చేసిన పవన్ కళ్యాణ్.. మరోసారి గెస్ట్ రోల్ లో మెరవనున్నారు. తన ఇష్టమైన డైరెక్టర్ త్రివిక్రమ్ కోసం మరోసారి గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. నితిన్ హీరోగా త్రివి్క్రమ్ డైరెక్ట్ చేస్తున్న అ..ఆ సినిమాలో పవన్ ఇలా గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం.

పవర్ స్టార్ తెలుగు సినిమాలో ఓ వెలుగు వెలుగుతున్నారు.. ఆయన పేరు, ఆయన పోస్టర్లను వాడుకుంటూ చాలా మంది స్టార్స్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు. అయితే చాలా మందికి పవన్ కళ్యాణ్ పేరు అంటే అదో తారక మంత్రంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్స్ చేసింది కూడా చాలా తక్కువ. గతంలో తన అన్న చిరంజీవి కోసం గెస్ట్ రోల్ చేయగా.. తాజాగా త్రివిక్రమ్ కోసం అ.ఆ సినిమాలో స్క్రీన్ మీద కనిపించనున్నారు. అయితే దీనికి మరో కారణం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కు నితిన్ హార్ట్ కోర్ ఫ్యాన్ కావడంతో.. అటు త్రివిక్రమ్, ఇటు నితిన్ ఇద్దరి కోసం ఇలా గెస్ట్ రోల్ లో కనిపించడానికి ఒప్పుకున్నారట. అయితే మామూలుగా పవన్ కళ్యాణ్ పేరు వస్తేనే.. ఊగిపోయే అభిమానులు ఇలా గెస్ట్ రోల్ లో కనిపించినప్పుడు వాళ్ల గోళ ఎలా ఉంటుందా అని అప్పుడే సినీ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles