ramgopal varma shifting back to mumbai

Rgv shifting base to mumbai

Ram Gopal Varma, Mumbai, Hyderabad, RGV, Killing Veerappan, puri jaganath, kcr, mega star fans, RGV hits, RGV movies, RGV bollywood, RGV tollywood, RGV flops

Ram Gopal Varma will be shifting his base to Mumbai once again. Due to some issues, the Hyderabad born maverick filmmaker left Bollywood couple of years ago

ముంబాయికి బిస్తర్ చదురుతున్న ఆర్జీవి

Posted: 12/26/2015 07:21 PM IST
Rgv shifting base to mumbai

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ తన మనస్సులోని అంతరంగాన్ని భయటపెట్టాడు. తాను పనిగట్టుకుని మెగా ఫ్యామిలీపై ట్విట్లు, కామెంట్లు చేస్తున్నానని చెప్పకనే చెప్పాడు. అది ఎలాగంటే.. బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న రామ్ గోపాల్ వర్మ కొద్ది రోజులుగా సౌత్ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్  చేస్తూ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ముఖ్యంగా ఇటీవల కాలం వర్మ తెలుగులో తెరకెక్కించిన సినిమాలు ఆయన టాలెంట్ మీదే అనుమానం కలిగేలా చేశాయి. వీటితో పాటు మెగా ఫ్యామిలీ మీద వర్మ చేసిన ట్విట్టర్ కామెంట్లు కూడా అభిమానులకు కోపం తెప్పించాయి. దీంతో ఆయన చిత్రాలు అంతంతమాత్రంగా ఆడుతూ.. అట్టర్ ప్లాప్ అవుతున్నాయి.

తన తెలుగు సినిమాలతో తనకే బోర్ కొట్టిందో, లేక బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి వర్మకు ఆహ్వానం పలికిందో తెలీదూ కానీ, త్వరలోనే ముంబై వెళ్లిపోతున్నట్టుగా ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. తన చిత్రాలను కొద్ది శాతం మంది మాత్రమే ఇష్టపడతారని, అందుకే వాటిని జాతీయ స్థాయిలో తీస్తే.. ఆ శాతం మంది అధికంగా వుండి తన చిత్రాలకు కలెక్షన్లు వస్తాయని గతంలో చెప్పిన వర్మ.. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు మరోమారు ప్రయాణం కానున్నారు. ఈ విషయాన్నే తానే స్వయంగా ప్రకటిస్తూ ' కిల్లింగ్ వీరప్పన్ సినిమా రిలీజ్ తరువాత, ముంబై వెళ్లిపోతున్నాను. పూరి జగన్నాథ్, కేసీఆర్, మా అమ్మ, ఇంకా మెగా ఫ్యామిలీ మీద నేను చేసే ట్వీట్స్ మిస్ అవుతాను' అంటూ ట్వీట్ చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramgopal varma  mumbai  Killing veerapan  KCR  

Other Articles