Vijay | donated | Chennai | flood relief | tollywood

Vijay donates 5 crore chennai floods

Vijay donated 5 crores to Chennai flood relief fund, Vijay donated 5 crores, Vijay 5 crores to Chennai flood relief fund, Vijay donated 5 crores to Chennai people, Vijay 5 crores, Vijay donates, Vijay helps to Chennai people, Vijay

Vijay Donates 5 Crore Chennai Floods: Now the latest from the film field says that Ilaya Thalapathy Vijay had donated rupees 5 crore to the Chennai flood relief fund last day.

చెన్నై వరద బాధితులకు అండగా నిలిచిన ఇలయథలపతి

Posted: 12/07/2015 11:21 AM IST
Vijay donates 5 crore chennai floods

చెన్నై నగరమంతా వరద నీటితో నిండిపోయింది. ప్రజలంతా కూడా తిండి, మంచి నీరు లేక నానా కష్టాలు పడుతున్నారు. చాలా వరకు ఇళ్లన్నీ కూడా నీటితో నిండిపోయాయి. డ్రైనేజ్ వాటర్ ఇళ్లల్లోకి రావడంతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలే చలికాలం కావడం, పైగా వరద నీటితో సమస్యలు ఎదుర్కొవడం.. చెన్నై ప్రజలను మరింత బాధపెడుతోంది.

ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను చేపట్టింది. ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు నటీనటులు విరాళాలను ప్రకటించడంతో పాటుగా, అక్కడి ప్రజలకు ప్రస్తుతం అవసరమయ్యే నిత్యవసర వస్తువులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే తమిళ స్టార్ నటీనటుల సైతం ఈ సహయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమిళ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ వంటి స్టార్ హీరోల తర్వాత అంతటి క్రేజ్ ను దక్కించుకున్న హీరో ఇలయథలపతి విజయ్. అలాంటి విజయ్ ను గతకొద్ది కాలంగా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తున్నారు. ఆ అభిమానుల కోసం ఇప్పటివరకు ఏ హీరో ఇవ్వనంతా విరాళాన్ని ప్రకటించాడు విజయ్.

చెన్నై వరద భాధితుల సహాయార్థం కోసం విజయ్ 5 కోట్లు విరాళాలను అందించాడు. అంతేకాకుండా తన అభిమానులను సహాయ కార్యక్రమాల్లో సాయపడాల్సిందిగా పిలుపునిచ్చాడు. తనకు స్వయంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని వున్నప్పటికీ, మీడియా, ప్రజలు, అభిమానుల తాకిడి ఎక్కువవుతుందనే వుద్దేశ్యంతో విజయ్ పాల్గొనడం లేదని తెలిసింది. ఏదేమైనా విజయ్ కేవలం తన సినిమాలతో ప్రజలను ఆనందపరచడమే కాకుండా... ప్రజలు కష్టాల్లో వున్నప్పుడు సరైన విధంగా సాయం చేసి నిజంగా ‘ఇలయథలపతి’ అనే పేరును నిలబెట్టుకుంటున్నాడు.

అలాగే దర్శకుడు రాఘవ లారెన్స్ కోటి రూపాయల విరాళాన్ని అందించారు. ఇటీవలే నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలిచిన నాజర్ సభ్యులు.. ఈ సహయ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. విశాల్, కార్తీ, వరలక్ష్మీ శరత్ కుమార్ లతో పాటు చాలా మంది నటీనటులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే సంగీత దర్శకుడు ఇళయరాజా తన వంతుగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  donates  helps  Chennai people  flood relief fund  

Other Articles