Rajinikanth | Robo2 | Movie Launch Postponed | Kabali | stills

Rajinikanth robo2 launch postponed

Rajinikanth Robo2 Movie Launch Postponed, Rajinikanth Kabali First Look Date, Rajinikanth robo2 launch date, Rajinikanth robo2 news, Rajinikanth latest news, Rajinikanth movie news, Rajinikanth movie updates, Rajinikanth stills

Rajinikanth Robo2 Launch Postponed: Tamil Super star Rajinikanth latest film Kabali. Ranjith direction. Rajinikanth upcoming film Robo2. This Movie Launch Postponed.

చెన్నై ప్రజల కోసం సూపర్ స్టార్ ‘రోబో2’ దూరం

Posted: 12/07/2015 10:46 AM IST
Rajinikanth robo2 launch postponed

ప్రతి ఏడాది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు(డిసెంబర్12) వేడుకలను అభిమానులు చాలా సంతోషంగా, సంబరంగా జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం రజనీ పుట్టినరోజు వేడుకలు జరగడం లేవు. అందుకు గల కారణం చెన్నై ప్రజలంతా ప్రస్తుతం కష్టాల్లో వుండటం. చెన్నైలో ఇటీవలే భారీ వర్షాల కారణంగా వరద నీటితో ప్రజలంతా కష్టాలుపడుతున్న విషయం తెలిసిందే.

వర్షాలు పడటం, అలాగే వరద నీరు భారీగా చేరటంతో అక్కడి ప్రజలు కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవద్దని రజనీకాంత్ డిసైడ్ అయ్యారని తెలిసింది. ప్రజలు సంతోషంగా వున్నప్పుడే నిజమైన సంబరాలు జరుపుకోవచ్చని రజనీకాంత్ భావిస్తూ.. ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవట్లేదని రజనీ స్పష్టం చేసినట్లుగా తెలిసింది.

ఈ పుట్టినరోజు వేడుకన రజనీకాంత్ చేయబోయే ‘రోబో2’ చిత్రానికి సంబంధించిన ముహూర్త కార్యక్రమాలను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఆ కార్యక్రమాలను కూడా వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. చెన్నై ప్రజలు కాస్త కుదురుకున్న తర్వాత అందరూ సంబరాలు జరుపుకునే విధంగా సినిమా వేడుకలను ప్రారంభించాలని రజనీ నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Robo2  Movie Launch Postponed  Kabali  stills  

Other Articles