Mahesh Babu | Santosh Sivan | AR Murugadoss

Cinematographer santosh sivan tweets about mahesh babu

Cinematographer Santosh Sivan Tweets about Mahesh Babu, Mahesh Babu remuneration for Murugadoss film, mahesh babu latest news, mahesh babu movie news, mahesh babu movie updates, mahesh babu stills, mahesh babu

Cinematographer Santosh Sivan Tweets about Mahesh Babu: Tollywood prince mahesh babu latest film brahmotsavam. after this film mahesh will do a film with tamil top director murugadas. Cinematographer Santosh Sivan. Mahesh Babu charges 30 crores for AR Murugadoss film

మహేష్ కోసం తమిళ సినిమాటోగ్రాఫర్ ఎదురుచూపులు

Posted: 11/27/2015 09:32 AM IST
Cinematographer santosh sivan tweets about mahesh babu

‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై ప్రసాద్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవి సెలవుల కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేష్ హీరోగో ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘గజిని’, ‘తుపాకీ’, ‘కత్తి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ సినిమాటోగ్రఫిని అందించనున్నారు. మహేష్ తో పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లుగా సంతోష్ శివన్ తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు.

ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాతలు ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. హారీస్ జయరాజ్ సంగీతం అందించనున్నాడు. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా కోసం మహేష్ దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mahesh Babu  Santosh Sivan  AR Murugadoss  tweets  Stills  

Other Articles