Nikhil | Tapsee | Avika gor

Nikhil romance with avika ghor and tapsee

Nikhil romance with tapsee and Avika ghor, Nikhil romance with tapsee, Nikhil romance with Avika ghor, Nikhil pair up with tapsee, Nikhil, tapsee, Avika gor

Nikhil romance with Avika gor and tapsee: tollywood young actor nikhil latest film shankarabharanam. this film will be release on 4 december. nanditha heroine.

ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న నిఖిల్

Posted: 11/24/2015 10:17 AM IST
Nikhil romance with avika ghor and tapsee

వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న నిఖిల్ మరో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా వున్నాడు. ప్రస్తుతం నిఖిల్ నటించిన ‘శంకరాభరణం’ చిత్రం వచ్చే నెల 4వ తేదిన విడుదల కానుంది. నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంవివి సత్యనారాయణ నిర్మించారు.

కోన వెంకట్ కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ ను అందిస్తున్నాడు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తర్వాత నిఖిల్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

‘టైగర్’ సినిమాకు దర్శకత్వం వహించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు వుండనున్నారు. తాప్సీని మొదటి హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇక రెండవ హీరోయిన్ గా అవికా గోర్ ను ఎంపిక చేసారు. త్వరలోనే మూడవ హీరోయిన్ ను ఫైనలైజ్ చేయనున్నారు.

ఫాంటసీ ప్రేమకథతో రూపొందనున్న ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నిఖిల్ నటించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ నెల రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil  tapsee  Avika gor  Movie news  hot stills  

Other Articles