ఒకప్పుడు టాలీవుడ్లో తన జీరో సైజ్ బాడీతో ఓ ఊపు ఊపేసిన గోవాబ్యూటీ.. బాలీవుడ్ అక్కున చేర్చుకోవడంతో తెలుగు ఇండస్ట్రీని తిట్టరాని తిట్లు తిట్టేసి వెళ్లిపోయింది. అక్కడు పలు సినిమాల్లో అవకాశాలు రావడం వల్ల ఈమెకి ఈగో ఆకాశ సరిహద్దులు దాటేసింది. అయితే.. ఇప్పుడు అక్కడ ఆఫర్లు కరువవడంతో తిరిగి తెలుగు సినిమాలపై దృష్టి సారించింది. హీరోయిన్గా కాకపోయినా.. సినిమాలో హైలైట్ అయ్యే ఏ పాత్రలో నటించడానికైనా రెడీగా వున్నానంటూ సందేశాలు ఇస్తోంది. అయినా అవకాశాలు రావట్లేదు. కానీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అమ్మడు ఓ ఐటెం సాంగులో నర్తించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ చిత్రం ‘డిక్టేటర్’ సినిమా చేస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం తమన్ ఓ సూపర్బ్ ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేశాడు. దీంతో ఈ సాంగులో ఎవరైనా హీరోయిన్‌తో చేయిస్తే బాగుంటుందని భావించిన మూవీ యూనిట్.. కొందరు భామలను పరిశీలించారు. చివరగా ఇలియానా అయితే బాగుంటుందని భావించి, ఆమెను అప్రోచ్ అయ్యారు. గతంలో ఇతర సినిమాల్లో ఐటెంసాంగులో నటించేందుకు ససెమిరా అన్న ఈ సన్నజాజి నడుము భామ.. బాలయ్య సినిమా అనగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. పైగా.. రెమ్యునరేషన్ కూడా తాను అడిగినంత ఇస్తామని యూనిట్ చెప్పడంతో ఇలియానా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకుంది. ఈ నెలాఖరున ఈ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేయనున్నారు.
ఇదిలావుండగా.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘డిక్టేటర్’ షూటింగ్ 80% పూర్తికాగా.. ఇంకా రెండు సాంగ్స్, రెండు ఫైట్స్ తో పాటు కొన్ని సీన్స్ మాత్రమే బాలన్స్ ఉన్నాయి. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ కి సూపర్బ్స్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీవాస్ – ఎరోస్ ఇంటర్నేషనల్ వారు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ అందించిన మ్యూజిక్‌ని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more