Aranmanai 2 first look horror poster released

Aranmanai 2 first look horror poster released

trisha krishnan, hansika motwani, Aranmanai movie news, Aranmanai 2 stills, Aranmanai 2 movie updates, Aranmanai trisha

Aranmanai 2 first look horror poster released : trisha krishnan and hansika's horror film Aranmanai 2 first look poster released.

దెయ్యాల వేషాల్లో గుబులు పుట్టిస్తున్న భామలు

Posted: 11/11/2015 03:49 PM IST
Aranmanai 2 first look horror poster released

చిత్రపరిశ్రమలో ఈమధ్య హారర్ కంటెంట్‌తో కూడిన సినిమాలు వరుసగా రావడంతోపాటు ఘనవిజయాలు సాధిస్తున్నాయి. ఆ హారర్‌లో కాస్తంత థ్రిల్లింగ్, కామెడీ మిక్స్ చేయడం వల్ల ప్రేక్షకులు పిచ్చిపిచ్చిగా ఆ సినిమాల్ని చూసేస్తున్నారు. ఈ ఫార్ములా బాగానే వర్కవుట్ అవుతుండటంతో ఆ తరహా సినిమాలతోపాటు సీక్వెల్స్ కూడా క్యూ కట్టేస్తున్నాయి. ఇప్పుడీ సీక్వెల్స్ జాబితాలోకి మరో సినిమా చేరిపోయింది.

గతేడాది తమిళంలో తెరకెక్కిన ‘అరణ్మణై’ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ సినిమాలో రాయ్ లక్ష్మీ హీరోయిన్‌గా నటించగా.. హన్సిక దెయ్యంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. తమిళంతోపాటు తెలుగులో ‘చంద్రకళ’ పేరిట విడుదలైన ఆ చిత్రం.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. డైరెక్టర్‌కి ప్రత్యేక ఇమేజ్ తెచ్చిపెట్టింది. దీంతో.. ఆ సినిమాకి సీక్వెల్ తీయాలని అప్పుడే నిర్ణయించిన ఆ చిత్రబృందం.. షూటింగ్ పనులు ప్రారంభించేసింది కూడా. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌లో దర్శకనిర్మాతలు చాలా మార్పులు చేసేశారు. సిద్ధార్ధ్‌ని హీరోగా తీసుకున్న డైరెక్టర్.. త్రిష - హన్సిక - పూనమ్ బజ్వాలను హీరోయిన్స్‌గా ఎంచుకున్నాడు. తారాగణాన్ని ఎంచుకున్న మరుక్షణమే షూటింగ్ ప్రారంభించేశారు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని దీపావళి కానుకగా యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రధాన నటీమణులైన త్రిష-హన్సిక పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఒక్క పోస్టర్‌తోనే అందాల ముసుగులో దాగివున్న హారర్ యాంగిల్‌ని చూపించిన దర్శకుడు.. సినిమా మొత్తం ఆ ఎలిమెంట్‌ని ఏ విధంగా ఎలివేట్ చేసి వుంటాడో అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే ఈ సీక్వెల్ చిత్రం మొదటి దానికంటే మరింత హారర్, కామెడీ, థ్రిల్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తుందని అనుకుంటున్నారు. ఈ సినిమా ‘చంద్రకళ 2’ పేరుతో రిలీజ్ కావచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aranmanai 2  trisha krishna  hansika motwani  

Other Articles