Tanu Nenu trailer with Akhil movie

Tanu nenu trailer with akhil movie

Avika Gor, Tanu Nenu, Tanu Nenu Trailer, tanu Nenu film, Tanu Nenu News, Ravi Babu in Tanu Nenu

Avika gors latest film Tanu Nenu trailer in big screen with Akhil cinema. P. Rammohan directed this film and it will be release on november last week.

అఖిల్ సినిమాతో పాటు అవికా గోర్ తను నేను ట్రైలర్

Posted: 11/11/2015 03:44 PM IST
Tanu nenu trailer with akhil movie

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన పి రామ్మోహన్‌ దర్శకుడిగా చేసిన తొలి చిత్రం 'తను నేను'. అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో 'వర్షం' చిత్ర దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దీపావళి కానుకగా నేడు విడుదల చేశారు.సన్ని ఎం.ఆర్‌. సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో నవంబర్‌ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అఖిల్ సినిమాతో పాటు తను నేను ట్రైలర్ ను ధియేటర్లలో ప్రసారం చెయ్యనున్నారు.

తను నేను సినిమా ట్రైలర్ లో రవిబాబు కూతురుగా అవికా గోర్ నటించింది. అమెరికాకు తన కూతురిని పంపించాలన్న కోరిక ఎలా తీరుతుంది అన్నది ట్రైలర్ లో డైరెక్టర్ చాలా బాగా చూపించారు. బండిరెడ్డి సర్వేశ్వర్ రావుగా రవిబాబు క్యారెక్టర్ కొత్తగా, ఇంట్రస్టింగ్ గా ఉంది. అఖిల్ లాంటి భారీ సినిమాతో పాటు వస్తున్న ట్రైలర్ ఖచ్చితంగా ఆడియన్స్ రీచ్ అవుతుంది. మరి చూడాలి అవికా గోర్ ఖాతాలో మరో హిట్ సినిమాగా తను నేను నిలుస్తుందా లేదా అన్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avika Gor  Tanu Nenu  Tanu Nenu Trailer  tanu Nenu film  Tanu Nenu News  Ravi Babu in Tanu Nenu  

Other Articles

Today on Telugu Wishesh