rajamouli fixed bahubali the conclusion movie shooting date

Rajamouli fixed bahubali the conclusion movie shooting date

rajamouli news, director rajamouli updates, babubali 2 news, bahubali the conclusion, bahubali movie updates, prabhas, rana daggubati, anushka shetty, tamanna bhatia news, kannada hero sudeep

rajamouli fixed bahubali the conclusion movie shooting date : tollywood ace director rajamouli has fixed the shooting date of bahubali the conclusion.

‘బాహుబలి 2’కి ముహూర్తం ఫిక్స్ చేసిన జక్కన్న

Posted: 11/11/2015 03:41 PM IST
Rajamouli fixed bahubali the conclusion movie shooting date

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి-ది బిగినింగ్’ సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు దక్కించుకుంది. త్వరలోనే ఇంటర్నేషనల్ రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమా స్టోరీ అర్థంతరంగా ఆగిపోవడంతో దానికి అనుబంధంగా వుండే రెండో పార్ట్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నే రెండో భాగంపై అప్పుడే భారీ క్రేజ్ క్రియేట్ చేసేసింది. అయితే.. రెండో భాగం షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారోనన్న విషయంపై మూవీ యూనిట్‌గానీ, రాజమౌళిగానీ ఇన్నాళ్లూ సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సస్పెన్స్‌ని బ్రేక్ చేస్తూ జక్కన్న ఈ రెండో భాగం షూటింగ్‌కి డేట్ ఫిక్స్ చేసేశాడు.

‘బాహుబలి-ది కన్‌క్లూజన్’ సినిమా షూటింగ్‌ని డిసెంబర్ 14 నుంచి మొదలు పెట్టనున్నారు. అయితే.. డిసెంబర్‌లో కొన్ని కొన్ని సింపుల్ సీన్స్‌ని మాత్రమే షూట్ చేయనున్నట్లు తెలిసింది. రెగ్యులర్ షూటింగ్‌ని జనవరి నుంచి మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే 40% షూటింగ్ ఫినిష్ చేసామని చెప్పిన రాజమౌళి మిగిలిన షూటింగ్ కోసం అన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ని ఫినిష్ చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. ‘బాహుబలి-2’ కోసం దాదాసే 190-200 రోజులపాటు షూటింగ్ చేయనున్నారు. ప్రభాస్ సుమారు 10 నెలలపాటు తన పూర్తి కాల్షీట్స్‌ని ఈ రెండో భాగానికి కేటాయించేసాడు. బాహుబలి-1 కంటే బాహుబలి 2 మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసాడు రాజమౌళి. మొదటి భాగానికైనా దానికంటే ఎక్కువగా ఈ రెండో భాగానికి బడ్జెట్ ఖర్చు చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. దాదాపు 300 కోట్ల మేర వుండవచ్చునని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ రెండో భాగంలో యుద్ధసన్నివేశాలు చాలా అమోఘంగా వుంటాయని, అలాగే కొత్త క్యారెక్టర్లూ ఇందులో వుంటారు కాబట్టి.. అంత బడ్జెట్ తప్పకుండా అవుతుందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali 2  director rajamouli  prabhas  

Other Articles