Swathi | Husband | Qualities | Tripura

Swathi reveals about her husbands qualities

Swathi talks about the qualities of her husband, Swathi husband qualities, Swathi latest interview, Swathi movie news, Swathi movie updates, Swathi stills, Swathi latest news, Swathi love story, Swathi

Swathi talks about the qualities of her husband: Tollywood heroine Swathi latest film Tripura release on 6 november. Swathi talks about the qualities of her husband

నో ఆప్షన్స్... నోర్మూసుకొని ఈ అమ్మడిని పెళ్లిచేసుకోవాలట!

Posted: 11/05/2015 10:37 AM IST
Swathi reveals about her husbands qualities

‘అష్టాచెమ్మా’ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపును దక్కించుకున్న స్వాతిని గతకొంత కాలంగా ఓ ప్రశ్న వెంటాడుతూనే వుంది. అదేంటంటే.. ‘మీ పెళ్లెప్పుడు?’ స్వాతి ఏ కార్యక్రమంలో పాల్గొన్న, ఇంటర్వ్యూలలో పాల్గొన్న కూడా ఈ ప్రశ్న ఖచ్చితంగా వుండాల్సిందే. ఇలాంటి రొటీన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో స్వాతికి అసలే ఓపిక చాలా తక్కువ. అందుకే ఈసారి ఈ ప్రశ్నకు ఓ క్లారిటీ ఇచ్చేసింది.

స్వాతి నటించిన ‘త్రిపుర’ చిత్రం ఈ నెల 6వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సంధర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వాతి తన పెళ్లి గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లిచేసుకుందామని అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరూ ఒకటే పరిశ్రమ కాదన్నది అప్పటి ఆలోచన. కానీ ఇపుడు నా మైండ్ సెట్ మారింది. ఇదే ఇండస్ట్రీ పర్సన్ అయితేనే నా వర్క్ కల్చర్ ను అర్థం చేసుకోగలడని అనిపిస్తోందని చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా తనకు కాబోయే భర్త ఎలా వుండాలో తెలియజేస్తూ... బాగా సెటిల్ అయ్యి వుండాలి. నన్ను బాగా ప్రేమించాలి. అర్ధం చేసుకునే మనస్తత్వం వుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిజాయితీగా వుండాలి. ఎందుకంటే మనిషికి క్యారెక్టర్ లేకపోతే మాత్రం నాకు వెంటనే కోపం వచ్చేస్తుందని స్వాతి చెబుతోంది. కానీ ఇప్పటివరకు అలాంటి వ్యక్తి స్వాతికి కనిపించలేడట. ఒకవేళ అలాంటి వ్యక్తి కనబడితే వెంటనే పెళ్లికి సిద్ధమైపోతుందట. తనకు నచ్చిన వ్యక్తి కనబడితే అతనికి ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా నోర్మూసుకొని నన్ను పెళ్లి చేసుకో అని అంటుందట. మరి ఈ అమ్మడిని పెళ్లి చేసుకునే ఆ వరుడు ఎక్కడున్నాడో ఏమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swathi  Husband  Qualities  Tripura  Interview  stills  

Other Articles