Niharika Konidela | Movie News | Muhurtham

Muhurtham fix for niharika konidela movie

Niharika Movie Muhurtham fix, Niharika Movie details, Niharika Movie updates, Niharika Movie stills, Niharika Konidela stills, Niharika Konidela latest stills, Niharika Konidela news, Niharika Konidela movies, Niharika Konidela movie updates, Niharika Konidela

Muhurtham Fix For Niharika Konidela Movie: Mega Brother Nagababu daughter Niharika introducing as a heroine. niharika latest movie title Oka Manasu.

మెగా హీరోయిన్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

Posted: 11/05/2015 11:50 AM IST
Muhurtham fix for niharika konidela movie

మెగా అభిమానులంతా మొన్నటివరకు మెగా హీరోలకోసం ఎదురుచూసారు. కానీ ఇప్పుడు మెగా హీరోయిన్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి రాబోతున్న గారాల పట్టి, మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. మెగా కుటుంబ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

యువ హీరో నాగశౌర్యతో కలిసి నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాను టీవి 9 సమర్పణలో మధుర శ్రీధర్ నిర్మించనున్న ఈ చిత్రానికి రామరాజు దర్శకత్వం వహించనున్నారు. ‘ఒక మనసు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ నెల 13 నుంచి హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందనుంది.

మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో నిహారిక యాంకర్ గా వ్యవహరిస్తుంది. మరి ఈ సినిమా ఎలా వుండనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Niharika Konidela  Movie News  Muhurtham  Stills  

Other Articles