Bobby Simha | Reshmi Menon | Engagement

Bobby simha getting engaged to reshmi menon

Bobby Simha to get engaged to Reshmi Menon, Bobby Simha engaged with Reshmi Menon, Bobby Simha Reshmi Menon Engagement, Bobby Simha Reshmi Menon wedding news, Bobby Simha Reshmi Menon stills, Bobby Simha Reshmi Menon news, Bobby Simha Reshmi Menon love story, Bobby Simha Reshmi Menon

Bobby Simha getting engaged to Reshmi Menon: Bobby Simha and Reshmi Menon are all set to get engaged on November 8. The Tamil industry is currently abuzz with rumours about "Urumeen" actors Bobby Simha and Reshmi Menon's marriage.

ఈనెల 8న రేష్మీతో బాబీసింహ నిశ్చితార్థం

Posted: 11/05/2015 10:00 AM IST
Bobby simha getting engaged to reshmi menon

తమిళంలో వరుస హిట్ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న బాబీసింహ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను ప్రేమించిన భామతో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. బాబీసింహ, తమిళ యువ నటి రేష్మీ మీనన్ గతకొద్ది కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.

అయితే వీరి ప్రేమ వ్యవహారంపై గతకొద్ది రోజులుగా పలు వార్తలొస్తూనే వున్నాయి. కానీ వీరి వ్యవహారంపై ఇరువురు ఖండించలేదు, అంగీకరించలేదు. కానీ వీరి ప్రేమను అర్థం చేసుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. దీంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

ఈ నెల 8న చెన్నైలోని ఓ గెస్ట్ హౌస్ లో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరుగనుంది. ఈ విషయంపై బాబీ సింహా మాట్లాడుతూ... వివాహా తేదినీ నిశ్చితార్థం రోజున నిర్ణయించారు. వచ్చే ఏడాది పెళ్లి జరుగనుంది. ఇక పెళ్లి తర్వాత రేష్మీమీనన్ సినిమాల్లో నటిస్తుందో లేదో అనే నిర్ణయాన్ని తనకే వదిలేస్తున్నామని చెప్పుకొచ్చాడు.

నేరం, జిగర్తండా, మసాలాపడం వంటి పలు చిత్రాల ద్వారా బాబీసింహా మంచి నటుడిగా గుర్తింపును దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇరైవి, కో2, పాంబుసండై, ఉరుమీన్ వంటి తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే రేష్మీమీనన్ కూడా పలు చిత్రాలలో నటిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bobby Simha  Reshmi Menon  Engagement  Stills  

Other Articles