Sreenu Vaitla | Rupa Vaitla | Responds | Files Harassment

Sreenu vaitla responds on rupa vaitla case

Sreenu Vaitla Responds on Rupa Vaitla Harassment Case, Rupa Vaitla Files Harassment Case Against Sreenu Vaitla, Rupa Vaitla Files Harassment Case, Rupa Vaitla Harassment Case on Sreenu Vaitla, Sreenu Vaitla latest news, Sreenu Vaitla case, Sreenu Vaitla wife, Rupa Vaitla case issue, Rupa Vaitla

Sreenu Vaitla Responds on Rupa Vaitla Case: Tollywood Successfull director Sreenu vaitla wife Rupa Vaitla Files Harassment Case Against on Sreenu Vaitla.

రూప గృహహింస కేసుపై శ్రీనువైట్ల కామెంట్లు

Posted: 10/27/2015 05:06 PM IST
Sreenu vaitla responds on rupa vaitla case

దర్శకుడు శ్రీనువైట్ల భార్య, రూప వైట్ల బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో తన భర్త శ్రీనువైట్లపై వారం రోజుల క్రితం ఫిర్యాదు చేసిందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. శ్రీనువైట్ల తనను మానసికంగా, భౌతికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ రూపవైట్ల తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలిసింది. అందుకు పోలీసులు 498/A, 323A సెక్షన్ల కేసు నమోదు చేశారు. అయితే మరుసటిరోజే రూప తన కేసును ఉపసంహరించుకున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేయడం వల్ల కౌన్సిలింగ్ కు రావాల్సి వుంటుందని రూపకు తెలియజేసారని తెలిసింది.

గతకొద్ది గంటల నుంచి ఈ వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు శ్రీనువైట్ల స్పందించారు. అసలు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. అసలు రూప కేసు పెట్టిన విషయం కూడా తనకు తెలియదని, తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై రూప కూడా తనకు ఈ కేసు గురించి తెలియదేని, తాను ఎలాంటి ఫిర్యాదు చేయలదేని అన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని, కలిసే వుంటున్నామని చెప్పుకొచ్చారు.

మరి ఈ విషయంపై శ్రీనువైట్ల-రూపవైట్లలు అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఈ వార్తలు ఆగేలా కనిపించడం లేదు. మరి భవిష్యత్తులో ఏం జరుగనుందో చూడాలి. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రూస్ లీ’ చిత్రం విజయవంతంగా అన్ని థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sreenu Vaitla  Rupa Vaitla  Responds  Files Harassment  Case  news  

Other Articles