Shah Rukh Khan | ED Summons | KKR | News

Ed again issued summons to shah rukh khan

ED summons Shah Rukh Khan, Shah Rukh Khan ED summons, Shah Rukh Khan latest news, Shah Rukh Khan news, Shah Rukh Khan summons, Shah Rukh Khan stills, Shah Rukh Khan

ED again issued summons to Shah Rukh Khan: Shah Rukh Khan gets third summons from ED. The Enforcement directorate has again issued summons to Kolkata Knight.

మరోసారి షారుక్ ఖాన్ కు ఈడీ నోటీసులు

Posted: 10/27/2015 05:09 PM IST
Ed again issued summons to shah rukh khan

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్(కేకేఆర్) వాటాలు అమ్మడంలో విదేశీ మారక ద్రవ్యం నిర్వాహణ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఇదే ఏడాదిలో మే నెలలో ఇప్పటికే ఈడీ షారుక్ కు నోటీసులు పంపింది.

తాజాగా వచ్చిన సమన్ల నేపథ్యంలో ఈడీ ముందు హాజరుకావాల్సిన అవకాశం వుంది. కానీ ఈడీ ముందు హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కావాలని, ప్రస్తుతం తాను ముంబైలో లేనని షారుఖ్ పేర్కొన్నట్లుగా తెలిసింది. కేకేఆర్ జట్టుకు షారుక్ తో పాటుగా బాలీవుడ్ భామ జూహీ చావ్లా, ఆమె భర్త జే మెహతాలు యజమానులుగా వున్నారు.

వీరు కేకేఆర్ వాటాలను తక్కువ ధరకు లెక్కగట్టి... మారిషస్ కంపెనీకు 2008లో అమ్మడం ద్వారా ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లుగా ఈడీ భావిస్తుంది. మరి ఈ విషయంలో అటు ఈడీ, ఇటు షారుక్ లు ఎలా స్పందిస్తారో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  ED Summons  KKR  News  

Other Articles