the first day us collections of varun tej's kanche movie | director krish | pragya jaiswal | telugu movie updates

Kanche movie first day us collections varun tej pragya jaiswal

kanche movie news, kanche movie updates, kanche news, kanche controversy, kanche updates, pragya jaiswal news, pragya jaiswal hot photo shoot, pragya jaiswal updates, director krish

kanche movie first day us collections varun tej pragya jaiswal : the first day us collections of varun tej's kanche movie which is directed by krish.

యుఎస్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన ‘కంచె’

Posted: 10/23/2015 08:02 PM IST
Kanche movie first day us collections varun tej pragya jaiswal

వరుణ్ తేజ్, ప్రగ్యాజైస్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘కంచె’ దసరా కానుకగా ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి సినిమాలతో తెలుగులో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు క్రిష్.. ఈ ‘కంచె’ సినిమానూ తనదైన బ్రాండ్‌తో సరికొత్త కథతో చిత్రాన్ని తెరకెక్కించాడు. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యానికి ఓ ప్రేమకథను జోడించి, ప్రేక్షకులకు గుడ్ ఫీల్ తెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రానటువంటి నేపథ్యమున్న కథతో వచ్చిన కంచె, తెలుగు సినిమాలో ఓ ప్రత్యేక సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ చిత్రం విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. థియేటర్లకు జనాలు పరుగులు పెడుతున్నారని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా క్లాస్ ఆడియెన్స్ నుంచి ఈ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక కలెక్షన్ల విషయానికొస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రూ.4 కోట్ల మేర ఈ సినిమా కలెక్షన్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అమెరికాలో ప్రీమియర్ షోస్ ప్లస్ మొదటి రోజు మొత్తం కలుపుకొని 99,808 డాలర్లు వసూలు చేసింది. రెండవ రోజు కూడా స్టడీ కలెక్షన్స్ సాధించింది. ‘కంచె’ లాంటి సినిమాకు ఈ కలెక్షన్స్ ఓ రకంగా ఉత్సాహాన్నిచ్చే విషయంగా చెప్పుకోవచ్చు.

ఇదిలావుండగా.. కంచె సినిమాలో కొత్త సీన్స్ యాడ్ అవుతున్నాయి. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కొత్త సీన్స్ కలుపుతున్నారు. అంతేకాదు.. థియేటర్ల సంఖ్య కూడ పెంచుతున్నారు. శుక్రవారం రోజు ఈ ప్రక్రియ చేపట్టారు. దీంతో.. ఈ సినిమా వసూళ్లు మరింత పెరుగుతాయని మూవీ యూనిట్ భావిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kalyan ram om movie progress
Hero gopichand latest film news  
Rate This Article
(0 votes)
Tags : kanche movie updates  varun tej  pragya jaiswal  

Other Articles