Sarathkumar | Vishal | case files | Defamation | Nadigar Sangam Elections

Sarathkumar files complaint against vishal

Sarathkumar files case against Vishal, Sarathkumar case against Vishal, Sarathkumar vs Vishal, Sarathkumar case files against Vishal, Vishal court issue, Vishal latest news, Vishal issues, Vishal case, Vishal defamation case, Sarathkumar

Sarathkumar files complaint against Vishal: nadigar Sangam President Sarathkumar has filed a defamation case against actor Vishal.

నువ్వేస్తే... నేనెయ్యనా.. నేనూ వేస్తా! ఎక్కడా తగ్గనంటున్న విశాల్

Posted: 10/10/2015 01:46 PM IST
Sarathkumar files complaint against vishal

తమిళ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నడిగర్ సంఘం ఎన్నికలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మొన్నటివరకు కేవలం మాటలతోనే సరిపెట్టుకున్న ఇరు జట్లు ఇపుడు ఏకంగా ఒకరిపైమరొకరు కేసులు వేసుకునే స్థాయికి వచ్చేసారు. ఈ ఎన్నికల్లో నటుడు శరత్ కుమార్, విశాల్ లు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ఈనెల 18న జరుగనున్నాయి. దీంతో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

ఇటీవలే విశాల్ పై తమిళ నటుడు శింబు చేసిన ఘాటు వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. అంతే కాకుండా తాజాగా విశాల్ తనపై అవినీతి, అక్రమాలు అంటూ లేనిపోనివి కల్పించి వ్యాఖ్యలు చేస్తూ పరువునష్టం కలిగించాడని ఆరోపిస్తూ శరత్ కుమార్ శుక్రవారం ఎగ్మోర్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసారు. ఈ విషయంపై విశాల్ కూడా అదేస్థాయిలో స్పందించారు. తాను కూడా త్వరలో శరత్ కుమార్ పై కేసు పెడతానంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసాడు. మొత్తానికి ఈ ఇరు జట్ల పోటీ కాస్త, పర్సనల్ యుద్ధం అయ్యేలా వుంది.

గతంలో విశాల్ కు శరత్ కుమార్ కూతురు, యువ హీరోయిన్ వరలక్ష్మీతో వివాహం జరుగనుందని వార్తలొచ్చాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇరువురు కొట్టిపారేసారు. అప్పటి నుంచే విశాల్, శరత్ కుమార్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, అందుకే ఇపుడు వీరిద్దరూ కూడా ఇలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారని కోలీవుడ్ జనాలు గుసగుసలు పెడుతున్నారు. మరి ఈ ఇరు జట్లలో ఎవరు విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarathkumar  Vishal  case files  Defamation  Nadigar Sangam Elections  

Other Articles