after baahubali ss rajamouli to direct garuda

Will jr ntr and mohanlal be part of ss rajamouli s rs 1000 crore project garuda

ss rajamouli to direct garuda, Jr NTR, Jr NTR latest news, Jr NTR photos, Jr NTR movie collections, Jr NTR twitter, Jr NTR latest updates, Jr NTR movie news, Jr NTR cinema News, Jr NTR upcomming movies, Jr NTR new look, Jr NTR ss rajamouli, Jr NTR maha bharatham, Jr NTR garuda, Jr NTR mohanlal, mohanlal, mohanlal rajamouli, mohanlal latest updates, mohanlal movie news

after baahubali ss rajamouli to direct garuda will mohanlal jr ntr be part of rs 1000 crore project

భారీ బడ్జట్ తో జక్కన డ్రీమ్ ప్రాజెక్టు

Posted: 10/04/2015 09:06 PM IST
Will jr ntr and mohanlal be part of ss rajamouli s rs 1000 crore project garuda

దర్శకుడు రాజమౌళిని ఇప్పుడు ఒక భాషకు చెందిన దర్శకుడిగా భావించలేం. అందుకు ఆయన తీసిన బాహుబలి.. దేశీయ బాషలతో పాటు అటు ప్రపంచ దేశాలలో రికార్డులను సృష్టించమే ఇందుకు ఉదాహరణ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ సినిమాను తనవైపు తిరిగి చూసేలా చేసిన చిత్రం బాహుబలి. ఆ గ్రాండీయర్‌ను, ఆ గ్రాఫిక్స్‌ను భారతీయ సినిమా ఇంతకు ముందెప్పుడూ చూడలేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఆ చిత్ర సృష్టికర్త బాహుబలి-2ను అంతకు మించిన బ్రహ్మాండంగా సెల్యులాయిడ్ పెకైక్కించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ చిత్రం తరువాత మహేశ్‌బాబు, అల్లుఅర్జున్‌లతో చిత్రాలు చేయనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఆ రెండు చిత్రాలు పూర్తైన తరువాత రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని సెల్యూలాయిడ్ పైకి ఎక్కించే పనిలో నిమగ్నమవుతారని టాక్. ఈ చిత్రానికి ఆయన భారీగానే బడ్జట్ ను వెచ్చించనున్నట్లు సమాచారం. అంటే సుమారుగా వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరపై ఆవిష్కరంచడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో పేర్కొనట్లు ప్రచారం జరుగుతోంది. దానికి గరుడా అని పేరును కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో జూనియర్ ఎన్‌టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం ఉన్నట్లు, మరో ముఖ్య పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SS Rajamouli  Garuda  Mohanlal  Jr NTR  Rs.1000crore  

Other Articles