Ram gopal varma controversial comments pawan kalyan mahesh babu twitter fans samantha

మహేష్ అభిమానుల్ని పొగిడాడు.. పవన్ ఫ్యాన్స్ ని కసితీరా తిట్టేశాడు..

Posted: 09/30/2015 01:16 PM IST
Ram gopal varma controversial comments pawan kalyan mahesh babu twitter fans samantha

వివాదాలకే పాఠం నేర్పే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. మరోసారి వార్తల్లోకెక్కాడు. ఈమధ్య తన సోషల్ సైట్ ట్విటర్ లోనే ఎక్కువ కాలం గడుపుతున్న ఈ డైరెక్టర్.. మరోసారి తన సైట్ కి పనిచెప్పాడు. ఇటీవల కాలంలో వర్మ స్టార్ హీరోలను ట్విటర్ వేదికగా పొగడుతూ వచ్చాడు కానీ.. ఈసారి అందుకు విరుద్ధంగా విమర్శలకు దిగాడు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ ట్విటర్ ఫాలోవర్స్ ను పోలుస్తూ.. పవన్ ఫ్యాన్స్ కంటే మహేష్ అభిమానులే బెస్ట్ అంటూ కితాబిచ్చాడు. అటు తన ఘాటు వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్పై సెటైర్స్ వేశాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్గా పరిగణించబడుతున్న పవన్ కళ్యాణ్కు ట్విటర్ లో అతి తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారంటూ తన మార్క్ కామెంట్స్ చేసిన ఈ దర్శకుడు.. సరికొత్త సంచలనానికి తెరలేపాడు.

ఇంతకీ వర్మ తన ట్విటర్ లో ఏం చెప్పాడంటే.. ‘‘ట్విట్టర్లో మహేష్ బాబుకు 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్కు కేవలం ఆరు లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉండటం విచిత్రంగా అనిపిస్తోంది. అంటే పవన్ ఫ్యాన్స్ నిరక్షరాస్యులా లేక సాంకేతికంగా అభివృద్ధి చెందలేదా..? నిజానికి పవన్ ఆలస్యంగా ట్విట్టర్లో జాయిన్ అయి ఉండొచ్చు, కానీ అలాంటి టాప్ స్టార్ సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు ఫ్యాన్స్ వెంటనే ఫాలో అవ్వాలి కదా..? చివరకు సమంతకు కూడా 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు పవన్ లాంటి టాప్ స్టార్కు అంత తక్కువ మంది ఫాలోవర్స్ ఉండటం నాకు నమ్మబుద్ధి కావటం లేదు. పవన్ కి అందరికంటే పెద్ద అభిమానినైన నేను.. పవన్కి మహేష్ కన్నా తక్కువ మంది ఫాలోవర్స్ ఉండటంపై తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాను. అందరూ టాప్ స్టార్స్కు పవన్ కన్నా ఎక్కువ  ఫాలోవర్స్ ఉన్నారంటే పవన్ ఫ్యాన్స్ మీద సైకోఎనలిటికల్ రిసెర్చ్ చేయాలేమో..? పవన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అడుగుతున్నాడు గానీ, ముందు తన ఫ్యాన్స్ని ట్విట్టర్ గురించి తెలుసుకునేలా అభివృద్ధి చేసుకోవాలని అని మీకు అనిపించటం లేదా..? పవన్ వీరాభిమానిగా నేను ఆయన అభిమానులను టెక్నికల్గా అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. అందుకోసం సమావేశాలు నిర్వహించైనా పవన్ ఫాలోవర్స్ని పెంచటానికి ప్రయత్నించాలి.’’

‘‘నేను పవన్ ఫ్యాన్స్ కన్నా మహేష్ ఫ్యాన్స్ను ఎక్కువ గౌరవిస్తాను. ఎందుకంటే.. వాళ్లు తమ అభిమాన నటుణ్ని చాలా గొప్పగా ఫాలో అవుతున్నారు. నేను మాత్రం పవన్ను ఫాలో అవ్వను. ఎందుకంటే నేను ఆయన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ మాత్రమే ఇష్టపడతాను కానీ ఆయన మానవతా దృష్టిని కాదు, రైతుల మీద ఆయనకు ఉన్న ప్రేమను కాదు. నేను మాత్రమే కాదు పవన్ అభిమానులందరూ అతని ఆలోచనల కన్నా, హీరోయిజాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. పవన్ యాక్టివ్గా లేకపోవటం వల్లే ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో వెనకపడిపోతున్నాడు. ప్రస్తుతం మహేష్ ఖాతాను ఫాలో అవుతున్న 15 లక్షల మార్క్ను పవన్ అందుకోవటానికి 2018 వరకు సమయం పడుతుంది. కానీ ఆ సమయానికి మహేష్ ఖాతాను దాదాపు 45 లక్షల మంది ఫాలో అవుతుంటారేమో’’.. అంటూ ఫినిష్ చేశాడు. మరి.. ఇతను చేసిన ఈ వ్యాఖ్యలకు మహేష్, పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!



AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles