Director Srivasu Shooting High Voltage Action Episode Between Kabir Singh And Balakrisha In Dictator Movie | Anjali Latest Updates | Sonal Chauhan

Balakrishna kabir singh high voltage action episode dictator movie director srivasu

dictator updates, dictator movie news, balakrishna dictator movie, dictator movie, balakrishna updates, balakrishna kabir das action, kabir das in dictator movie, kabir das dicator, anjali in dictator, anjali dictator stills, director srivasu stills

Balakrishna Kabir Singh High Voltage Action Episode Dictator Movie Director Srivasu : Director Srivasu Shooting High Voltage Action Episode Between Kabir Singh And Balakrisha In Dictator Movie.

కబీర్, బాలయ్యల మధ్య హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్

Posted: 09/30/2015 11:23 AM IST
Balakrishna kabir singh high voltage action episode dictator movie director srivasu

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం ‘డిక్టేటర్’. శ్రీవాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగా, అభిమానులను మెప్పించే ఫ్యామిలీ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని భారీ ఎపిసోడ్స్ కూడా వున్నాయి. అయితే.. గత సినిమాలతో పోల్చుకుంటే ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ మరింత హైలైట్ గా వుంటాయని చిత్రబృందం తెలుపుతోంది.

ఇటీవల యూరప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ‘డిక్టేటర్’ చిత్రబృందం.. తాజా షెడ్యూల్ ని హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. గత కొద్ది రోజులుగా బాలకృష్ణ, ఇతర తారాగణంపై వచ్చే ఇంటర్వల్ బ్లాక్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో భాగంగా ఓ పవఫుల్ యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ లో బాలకృష్ణ టాలీవుడ్ న్యూ విలన్ ‘జిల్’ ఫేమ్ కబీర్ దుహన్ సింగ్ తో తలపడుతున్నాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ని చూసే ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా ఉంటూనే సరికొత్తగా ఉండేలా యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ తోపాటు ఇతర షూటింగ్ పార్ట్ ని కంటిన్యూగా హైదరాబాద్ లోనే జరపనున్నారు. దర్శకుడు శ్రీవాస్ కంటిన్యూ షెడ్యూల్స్ తో సినిమాని డిసెంబర్ కల్లా ఫినిష్ చేసి.. 2016 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.

ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ కి సూపర్బ్స్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న ఈ సినిమాని శ్రీవాస్ – ఎరోస్ ఇంటర్నేషనల్ వారు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ మొదటిసారి బాలకృష్ణ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dictator movie updates  actress anjali news  director sri vasu  kabir das updates  

Other Articles