Director Harish Shankar Developing A Strong Story For Raviteja To Give Him A Big Hit | Tollywood News | Producer Dil Raju

Director harish shankar develop story for raviteja tollywood news

harish shankar news, harish shankar updates, harish shankar latest photos, harish shankar with raviteja, raviteja new project, raviteja dilraju movie, raviteja harish movie, bengal tiger updates, bengal tiger movie details

Director Harish Shankar Develop Story For Raviteja Tollywood News : Director Harish Shankar Developing A Strong Story For Raviteja To Give Him A Big Hit.

రవితేజను ‘షాక్’ నుంచి బయటపడేయనున్న డైరెక్టర్!

Posted: 09/30/2015 01:52 PM IST
Director harish shankar develop story for raviteja tollywood news

మాస్ మహారాజా రవితేజ్ ఇమేజ్ ఇండస్ట్రీలో రానురాను తగ్గిపోతోంది. ‘విక్రమార్కుడు, కిక్’ తర్వాత ఈ హీరోకి ఆ స్థాయిలో విజయం దక్కలేదు. పైగా.. ఆమధ్య వరుసగా 6 సినిమాలు ఫ్లాప్ కావడంతో మాస్ వ్యాల్యూ తగ్గిపోయింది. అయితే.. ‘బలుపు’తో తిరిగి పుంజుకున్నాడు కానీ.. అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోగా యావరేజ్ గానే నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘పవర్’ సినిమా కూడా మంచి విజయం సాధించింది కానీ.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు చేయలేకపోయింది. ఇక ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన ‘కిక్-2’ అట్టర్ ఫ్లాప్ అయింది. నిజానికి ఆ చిత్రం ఘనవిజయం సాధించి, రవితేజ్ ‘కిక్’తో పాటు ఇండస్ట్రీలో కంఫర్ట్ తెచ్చిపెడుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో అభిమానులతోపాటు రవితేజ కూడా షాక్ లో వుండిపోయాడు. అయితే.. ఇతనిని ఈ షాక్ నుంచి బయటకు నెట్టి భారీ విజయం అందించాలని ఓ డైరెక్టర్ ఫిక్సయ్యాడు. కోల్పోయిన ఇమేజ్ ని తిరిగి రప్పించేందుకు రంగంలోకి దిగాడు.

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో రీసెంట్ గా హిట్ కొట్టిన హరీష్ శంకర్... ఇప్పుడు రవితేజ కోసం రంగంలోకి దిగాడు. అతనికోసం ఓ మంచి కథను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. గతకొన్నాళ్ల నుంచి సరైన విజయాలు లేక సతమతమవుతున్న రవితేజకి ఓ రేంజ్ హిట్ ఇవ్వడం కోసమే హరీశ్ రంగంలోకి దిగినట్టు సమాచారం. రవితేజ కోసం హరీష్ ఎందుకింత కేర్ తీసుకుంటున్నాడంటే.. చాలాకాలం నుంచి వీరిద్దరి మంచి స్నేహం వుంది. తొలుత హరీష్ ని దర్శకుడిగా ప్రోత్సాహించింది రవితేజనే. ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్న హరీష్ శంకర్ ను ‘షాక్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశాడు రవితేజ. అయితే.. ఆ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయింది. అయినప్పటికీ అతనితో వున్న స్నేహం కారణంగా నమ్మకంతో ‘మిరపకాయ్’ కి ఓకే చేశాడు మాస్ మహారాజా. అంతలా నమ్మి తనకు అవకాశాలు ఇచ్చిన రవితేజకి ఇప్పుడు సరైన భారీ హిట్ అందివ్వడం కోసమే హరీష్ రంగంలోకి దిగాడు. కేవలం కథని మాత్రమే డెవలప్ చేయడం కాకుండా స్ర్కీన్ ప్లేను, మాటలను సైతం హరీస్ శంకరే సమకూర్చుతున్నాడట. పైగా.. తానే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. అయితే.. వీరి కాంబో చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాల్సిందే!

ఇదిలావుండగా.. ప్రస్తుతం రవితేజ ‘బెంగాల్ టైగర్’ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా వున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తమన్నాతో పాటు రాశి ఖన్నా కూడా నటిస్తోంది. కె.కె రాధా మోహన్ నిర్మాణంలో, భీమ్ప్ మ్యూజిక్ డైరెక్షన్ లో దసరా కానుకగా బెంగాల్ టైగర్ ఆడియో విడుదల కానుంది. నవంబర్ లో సినిమా విడుదలకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు నిర్మాత దిల్ రాజు కూడా రవితేజతో ఓ మూవీ తీయనున్నట్లు గతంలో తెలిపిన విషయం తెలిపిందే. ఆ మూవీ అయిన అనంతరం హరీష్ శంకర్ తో చేసే సూచనలున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harish shankar raviteja  bengal tiger movie  producer dil raju  

Other Articles