Maa TV Has Fixed Huge Amount For 10 Seconds Of Advertisement During Bahubali Movie Telecast | Bahubali Records

Maa tv fix huge amount for 10 seconds advertisement during bahubali movie telecast

bahubali news, bahubali on maa tv, bahubali maa tv news, bahubali advertisements, bahubali controversies, bahubali movie news, bahubali on tv, maa tv telecast, maa tv updates, rajamouli, prabhas, rana daggubati, anushka shetty, tamanna bhatia

Maa TV Fix Huge Amount For 10 Seconds Advertisement During Bahubali Movie Telecast : Maa TV Has Fixed Huge Amount For 10 Seconds Of Advertisement During Bahubali Movie Telecast.

బుల్లితెరపై బ్యాండ్ బజాయించనున్న ‘బాహుబలి’!

Posted: 09/29/2015 06:39 PM IST
Maa tv fix huge amount for 10 seconds advertisement during bahubali movie telecast

‘బాహుబలి’ చిత్రం సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విశ్వవ్యాప్తంగా ప్రశంసలు పొందడంతోపాటు అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది సినిమాగా సంచలనం సృష్టించింది.  తెలుగు సినిమా చరిత్రలోనే కాదు... ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలనంగా నిలిచిన ‘బాహుబలి’..  ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషల్లో కలిపి ఈ చిత్రం దాదాపు 650 కోట్లు వసూలు చేసిన అందరినీ ఆశ్చర్య పరిచింది.
 ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని చాటిచెప్పిన సినిమాగా పేరుగాంచింది. ఇలా లెక్కపెట్టుకుంటూపోతే.. ఆ సినిమాను పొడిగేందుకు మాటలు చాలవేమో అన్నంతగా సత్తా చాటింది. ఇన్ని రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా బుల్లితెరపై మరో సంచలనం సృష్టించేందుకు సన్నద్ధమైంది. ఇప్పటిదాకా కాస్తోకూస్తో డబ్బులు ఇచ్చుకుని తమ ప్రోడక్టులను బుల్లితెరపై ప్రచారం చేసుకున్న కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఈ సినిమా చుక్కలు చూపించనుంది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులను ‘మా టీవీ’ దాదాపు 18 కోట్ల రూపాయలకు కొన్న విషయం తెల్సిందే! దసరా సందర్భంగా అక్టోబర్ 25న ఈ మూవీని బుల్లితెరపై ప్రసారం చేయనున్నారు. అయితే.. తెలుగు ఇండస్ట్రీలోనే ఇదివరకెన్నడూ లేనంతగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి. దీంతో మాటీవి యాజమాన్యం అంత పెద్ద మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవాలని ఉద్దేశంతో.. ఈ సినిమా బ్రేక్ టైమ్ లో కాస్త ఎక్కువ డబ్బుల్ని యాడ్స్ ద్వారా వసూలు చేసేందుకు ప్లాన్ వేసింది. బ్రేక్ టైమ్‌లో కేవలం 10 సెకన్ల యాడ్‌కు దాదాపు రూ. 2.5 లక్షల రూపాయలు చెల్లించాలని యాజమాన్యం రేట్ ఫిక్స్ చేసింది. ఈ విషయం తెలిసిన కొన్ని కంపెనీలు తొలుత ఆశ్చర్యానికి గురైనా.. ఆ తర్వాత అంత మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. నిజానికి.. ఇప్పటి వరకు ఏ సినిమాకు యాడ్స్ ఇంత ఖరీదుగా లేవు. ఇంకా చాలా తక్కువగానే వుంటాయి. దీన్ని బట్టే ‘బాహుబలి’ సినిమా క్రేజ్ ఎంత వుందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ‘బాహుబలి’ లాంటి సినిమా బుల్లితెరపై ప్రసారం అవుతున్నప్పుడు దాని బ్రేక్ టైంలో అంత మొత్తం ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ట్రేడ్ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.

కేవలం ఆ సినిమాను బుల్లితెరపై వేసినప్పుడే కాదు.. ఆ చిత్రం వేసే ఓ రోజు ముందు అంటే 24వ తేదీన తమ షూటింగ్ అనుభవాల గురించి రాజమౌళితోపాటు ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కలు వివరించనున్నారు. వారి ఇంటర్వ్యూలను దాదాపు రెండు గంటలపాటు ఈ ఛానల్ టెలికాస్ట్ చేయనుంది. అప్పుడు కూడా బ్రేక్ సమయంలో 10 సెకన్ల యాడ్ కు రూ.2.5 లక్షలు చెల్లించాల్సి వుంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే.. మాటివికి ‘బాహుబలి’ సినిమా ద్వారా శాటిలైట్ కొనుగోలు చేసిన డబ్బుల కంటే మరింత ఎక్కువ లాభాలు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali on maa tv  maa tv advertisements  rajamouli  

Other Articles