After A Long Time Samantha Denies The Relationship Rumours With Tamil Businessman | Kollywood Gossips | Tollywood News

Samantha denies relationship with businessman kollywood gossips tollywood updates

samantha news, samantha affair, samantha latest controversy, samantha affair with sidharth, samantha hot photos, samantha hot photo shoot, samantha hot gallery, samantha photo shoot, samantha businessman, samantha marriage, kollywood gossips

Samantha Denies Relationship With Businessman Kollywood Gossips : After A Long Time Samantha Denies The Relationship Rumours With Tamil Businessman.

‘నాకు అతనెవరో కూడా తెలీదు’ : సమంత

Posted: 09/29/2015 06:31 PM IST
Samantha denies relationship with businessman kollywood gossips tollywood updates

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న సమంతకు సంబంధించి కోలీవుడ్ లో గతకొన్నాళ్ల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు ఓ బిజినెస్ మేన్ తో ప్రేమాయణం నడుపుతోందని.. త్వరలోనే అతనితో పెళ్లి చేసుకోవడం ఖాయమని ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా.. వారిద్దరు పార్టీలు, పబ్బులకంటూ తెగ తిరుగుతున్నారని కొన్ని వార్తాకథనాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకుని, త్వరలోనే ఆ వ్యాపారవేత్తతో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటోందని పుకార్లు కూడా వెలుగులోకి వచ్చాయి. గత రెండు నెలల నుంచి ఇటువంటి వార్తలు తరచూ వస్తున్నప్పటికీ సమంత పెదవి విప్పకపోవడంతో ఆ గాసిప్పులకు మరింత బలం చేకూరింది. ఓ సందర్భంలో కొందరు మీడియా ప్రతినిధులు తన లవ్ ఎఫైర్ కు సంబంధించి వస్తున్న వార్తలపై స్పందించాలని కోరగా.. అప్పుడు ఆమె ఏమీ చెప్పకపోగా చిరునవ్వు నవ్వుతూ సైడైపోయింది. అంతే! అప్పటినుంచి ఈమె ప్రేమాయణం నిజమేనని అంతా అనుకున్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆ పుకార్లని ఖండించింది సమంత.

ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లను చేజిక్కించుకున్న సమంతకు ఈమధ్య అంతగా రావడం లేదు. పైగా.. ఈ సందర్భంలోనే ఆమె సిద్ధార్థతో వున్న తన ప్రేమాయణాన్ని తెంపుకుంది. ఆ తర్వాత కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే తెరమీద కనిపిస్తూ వస్తోంది తప్ప.. మునుపటిలా హుషారుగా కనిపించలేదు. దీంతో ఆమె రహస్యంగా ఓ వ్యాపారవేత్తతో ప్రేమాయణం సాగిస్తోందంటూ వార్తలు వెలుగులోకి వచ్చాయి. గత రెండు నెలల నుంచి చక్కర్లు కొడుతున్న ఈ పుకార్లపై ఎన్నడూ స్పందించని సమంతా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాటిపై క్లారిటీ ఇచ్చింది. తనకు ఎవరితోనూ ఎఫైర్ లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. తాను ఓ వ్యాపారవేత్తతో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. ఇంతకీ ఆ బిజినెస్ మెన్ ఎవరో, ఇటువంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని చెప్పింది. ఏదైనా వార్త రాయాలనుకుంటే ముందుగా కన్ఫర్మ్ చేసుకుని, ఆ తర్వాత ప్రచురించండని ఆమె మీడియాని కోరింది. ప్రస్తుతం తాను కేవలం తన కెరీర్ పైనే దృష్టి సారించానని, ఇప్పట్లో ప్రేమలో పడటంగానీ, పెళ్లి చేసుకోవడం కానీ జరగదని తేల్చి చెప్పేసింది. ఒకవేళ తాను ప్రేమలో పడితే.. ఆ వివరాల్ని స్వయంతా తానే వివరిస్తానని తెలిపింది కూడా.

అంతేకాదు.. ప్రస్తుతం సినిమాలు తగ్గుముకం పట్టడంతో సమంత సినిమాల నుంచి రిటైర్ కానుందని ఆమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే.. తాను అలా ఎప్పుడూ చెప్పలేదని తెలిపింది. ఇటీవల మంచి కథలతో కూడిన సినిమా ఆఫర్లు రాకపోవడంతో తాను సినిమాలు ఒప్పుకోవడం లేదని, మంచి కథ, పాత్ర కూడిన అవకాశాలొస్తే కచ్చితంగా నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. ఏదైతేనేం.. చివరికి ఈసారి కూడా సమంత తన పెళ్లి మేటర్ లేవనెత్తకుండానే తనపై వస్తున్న గాసిప్స్ ని తుడిచిపెట్టేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha love affairs  kollywood gossips  actor sidharth  

Other Articles