Varun Tej Latest Movie Loafer Title Changed As Maa Amma Seethamalakshmi | Puri Jagannadh Interview | Ram Gopal Varma Twitter

Varun tej loafer movie changed as maa amma seethamalakshmi puri jagannadh ram gopal varma

varun tej news, varun tej updates, varun tej new movie, varun tej loafer movie, varun tej maa amma seethamalakshmi, director puri jagannadh news, ram gopal varma controversies, producer kalyan, disha patani, actress disha patani updates

Varun Tej Loafer Movie Changed As Maa Amma Seethamalakshmi Puri Jagannadh Ram Gopal Varma : Varun Tej Latest Movie Loafer Title Changed As Maa Amma Seethamalakshmi

వరుణ్ ‘లోఫర్’ సినిమా టైటిల్ మారింది..

Posted: 09/30/2015 11:12 AM IST
Varun tej loafer movie changed as maa amma seethamalakshmi puri jagannadh ram gopal varma

మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. తొలుత ఈ సినిమాకు ‘లోఫర్’ టైటిల్ ఖరారు చేసినట్లు దర్శకుడు పేర్కొన్నాడు. కానీ.. ఇఫ్పుడు ఆ టైటిల్ ని తీసేసి, మరో కొత్త టైటిల్ నిర్ణయించినట్లు తాజా సమాచారం. ‘లోఫర్’ టైటిల్ తన గురువు రాంగోపాల్మ వర్మకు నచ్చలేదని, వెంటనే దాన్ని మార్చమని చెప్పడంతో సినిమా టైటిల్ మార్చనున్నట్లు ఇటీవల మీడియాతో చెప్పాడు. అటు ఈ చిత్ర నిర్మాత కల్యాణ్ కు సైతం ఈ టైటిల్ నచ్చలేదట. దాంతో బాగా ఆలోచించిన అనంతరం ‘మా అమ్మ సీతామాలక్ష్మి’ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తాజా సమాచారం. అయితే.. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

నిజానికి వరుణ్ పాత్రకు తగినట్లు ఆ సినిమా టైటిల్ ని ‘లోఫర్’గా ఫిక్స్ చేసినట్లు గతంలో పూరీతోపాటు యూనిట్ వర్గాలు తెలిపాయి. కానీ.. ఆ టైటిల్ అంతగా బాగోలేదని వర్మ, కల్యాణ్ తమ అభిప్రాయాలను వెల్లడించిన నేపథ్యంలో.. పూరీ ‘మా అమ్మ సీతామాలక్ష్మి’ అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించాడు. ఈ సినిమా మదర్ సెంటిమెంటుతో రూపొందుతున్నందున ఈ పేరు బాగుంటుందని అనుకుంటున్నారట. మరి.. ఈ టైటిల్ ని ఖరారు చేస్తారా? లేక మరో టైటిల్ ని తెరమీదకు తీసుకొస్తారా? అనే విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే! ఇక ఈ చిత్రంలో వరుణ్ సరసన మోడల్ దిశా పతాని నటిస్తోంది. ఈ అమ్మడికి మొదటి సినిమా కావడంతో చాలా ఆశలు పెట్టుకున్నట్టు సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varun tej movie updates  maa amma seethamalakshmi  director puri jagannadh  

Other Articles