Producer Dil Raju Registers three different titles

Producer dil raju registers three different titles

Dil Raju Registers three different titles, Dil Raju three different titles, Dil Raju upcoming film titles, Subramanyam for sale movie news, Subramanyam for sale stills, Subramanyam for sale songs, Subramanyam for sale trailers, Krishnashtami film news, Krishnashtami movie updates, Krishnashtami stills, Krishnashtami

Producer Dil Raju Registers three different titles: Tollywood producer Dil Raju Registers three different titles in Film chamber. Dil Raju Upcoming films Subramanyam for sale, and Krishnashtami.

ఆసక్తి పెంచుతున్న దిల్ రాజు కొత్త టైటిల్స్

Posted: 09/09/2015 10:47 AM IST
Producer dil raju registers three different titles

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇతర సినిమాల డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా దిల్ రాజు ఎంపిక కూడా సరైనదిగా వుంటుందని సినీవర్గాల అంచనా. అయితే ప్రస్తుతం దిల్ రాజు రిజిస్టర్ చేయించిన టైటిల్స్ మాత్రం ఎవరి అంచనాలకు అందడం లేదు.

దిల్ రాజు తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లో మూడు ఆసక్తికరమైన టైటిల్స్ ను రిజిస్టర్ చేసారు. అవి ‘జనగణమన’, ‘సుప్రీమ్(ఎసి/డిటిఎస్)’, ‘ఎవడో ఒకడు’. ఈ మూడు టైటిల్స్ ఏ హీరో కోసం, ఏ సినిమా కోసం అనేవి అర్థం కాకుండా వున్నాయి. పైగా మూడు టైటిల్స్ కూడా చాలా డిఫరెంట్ గా వున్నాయి.



ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దీని తర్వాత అనిల్ రావిపూడి-సాయిధరమ్ తేజ కాంబినేషన్లో దిల్ రాజు ఓ చిత్రం నిర్మించనున్నారు. అలాగే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్, రవితేజలతో కూడా దిల్ రాజు సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నుంచి దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నాడు.

మరి ఈ మూడు టైటిల్స్ ఏ హీరోకు, ఏ సినిమాకు చెందనున్నాయో అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది. ఈ సినిమా టైటిల్స్ పై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ హీరోకు ఏ టైటిల్ అయితే బాగా సరిపోతుందో చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  Registers  three different titles  Subramanyam for sale  Krishnashtami  

Other Articles