దక్షిణాది నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రముఖ సినీనటుడు మాధవన్.. తమిళనాడులోని ఓ గ్రామంలో తమ భూములను కబ్జా చేశాడని జిల్లా కలెక్టర్ కు పిర్యాదు అందింది. తమ పంటపోలాలకు వచ్చే పంట కాలువను ఆక్రమించుకుని విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకున్నారని పళని రైతులు దిండుకల్ కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. అనంతరం పాలసముద్రం ప్రాంతం రైతులు మహాలక్ష్మి, గణేశన్ తదితరులు మాట్లాడుతూ పళని సమీపం విలాంకోంపై తేక్కన్ తోట ప్రాంతంలో టీటీఎల్ పంట కాలువ ఉందనీ, కొడైకెనాల్ పర్వతం నుంచి పారే జలాలు ఈ పంట కాలువ ద్వారా ప్రవహించి తేక్కన్ తోట ప్రాంతంలోని 50 ఎకరాల భూములకు సాగునీరు అందుతోందన్నారు.
నటుడు మాధవన్ ఆ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం ఏడు ఎకరాల భూములను కొనుగోలు చేశారనీ, ఆ తర్వాత మాధవన్ వర్గీయులు ఆ పంట కాలువను ఆక్రమించుకుని విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా అక్కడి పొరంబోకు భూములను కూడా ఆక్రమించుకున్నారన్నారు. రెవెన్యూ అధికారులు సినీనటుడు మాధవన్‌కు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. తమ భూములను కూడా విక్రయించమంటూ మాధవన్ వర్గీయులు తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. పంటకాలువను, కాలినడక మార్గాన్ని, పొరంబోకు భూములను ఆక్రమించుకున్న మాధవన్‌పై, ఆయనకు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరపాలని జిల్లా యంత్రాగం ఉత్తర్వులు జారీ చేసింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more